లైఫ్‌లో క్రష్ అంటే అది నాగార్జున గారి మీదే.. ఆయన షేక్‌హ్యాండ్ ఇస్తే ఏం చేశానంటే!..

  • Published By: sekhar ,Published On : August 13, 2020 / 02:50 PM IST
లైఫ్‌లో క్రష్ అంటే అది నాగార్జున గారి మీదే.. ఆయన షేక్‌హ్యాండ్ ఇస్తే ఏం చేశానంటే!..

సీనియర్ హీరోయిన్ కస్తూరికి కింగ్ నాగార్జున అంటే క్రష్ అట.. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించి పాపులర్ కథానాయికగా గుర్తింపు తెచ్చుకున్న కస్తూరి శంకర్ పెళ్లి తర్వాత అడపా దడపా సినిమాలు చేస్తున్నారు. ఇటీవల ఆలీ హోస్ట్ చేస్తున్న ‘ఆలీతో సరదాగా’ ప్రోగ్రాంకి కస్తూరి హాజరయ్యారు. తాజాగా ఆ ఎపిసోడ్ తాలుకు ప్రోమో రిలీజ్ చేశారు.

‘నాగార్జున గారు షేక్‌హ్యాండ్ ఇస్తే షూటింగ్ పేకప్ అయిన తర్వాత కూడా చెయ్యి కడగకుండా అలానే పెట్టుకుని పడుకున్నారట’ ఏంటని ఆలీ అడగ్గా.. ‘‘అవును.. ఏంతోమంది హీరోలతో పనిచేశాను కానీ, లైఫ్‌టైంలో క్రష్ అనేది ఒకరిమీద వచ్చింది అంటే అది నాగార్జున గారి మీదే’’.. అని చెప్పడంతో ఆలీ ఆశ్చర్యపోయారు. ఈ ప్రోమోలో కస్తూరి, నాగార్జున గురించి చెప్పినంత వరకు కట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు కింగ్ ఫ్యాన్స్.. కస్తూరి నాగార్జునతో కలిసి ‘అన్నమయ్య, ఆకాశవీధిలో’ సినిమాల్లో నటించారు.

మొత్తానికి ఈ ఎపిసోడ్‌లో ఆమె నాగ్ గురించి ఇంకేం చెప్పుంటారు అనే ఆసక్తితో పాటు.. క్రికెటర్ ధోని, తన సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణలతో పాటు విజయ్ దేవరకొండతో నటించడం గురించి.. డాక్టర్ అయిన తన భర్త అమెరికాలో ఉంటే ఆమె మాత్రం ఎందుకు పిల్లలతో కలిసి చెన్నైలో ఉంటున్నారు.. సోషల్ మీడియాలో తనను వేధింపులకు గురిచేసిన ఒక పర్సన్ గురించి సొంతగా యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేయడానికి కారణం ఏంటి?.. ఇలా పలు ఆసక్తికర విషయాలు కస్తూరి పూర్తి ఎపిసోడ్‌లో వివరించనున్నారు.