బార్లోకి అడుగుపెట్టిన మందు బాబు ఆనందం.. మాటల్లో చెప్పలేం.. వీడియో వైరల్..

లాక్‌డౌన్ తర్వాత బార్‌లోకి ఎంటరైన మందుబాబు ఆనందం.. వైరల్ అవుతున్న వీడియో..

  • Published By: sekhar ,Published On : May 4, 2020 / 11:49 AM IST
బార్లోకి అడుగుపెట్టిన మందు బాబు ఆనందం.. మాటల్లో చెప్పలేం.. వీడియో వైరల్..

లాక్‌డౌన్ తర్వాత బార్‌లోకి ఎంటరైన మందుబాబు ఆనందం.. వైరల్ అవుతున్న వీడియో..

దాదాపు 40 రోజులు మందు బాబులు పెగ్గు కోసం అల్లాడిపోయారు. పెగ్గు పడక చిత్ర విచిత్రంగా ప్రవర్తించారు. చివరకు మెంటల్ హాస్పిటల్‌లో అడ్మిట్ అయిన సంఘటనలు కూడా చూశాం. రోజులో ఒక్క గంట పాటు వైన్ షాపులు తెరవండి మహాప్రభో అని మొత్తుకున్నారు. డబ్బున్నోళ్లు వేలకువేలు పెట్టి కొనుక్కున్నారు. మరి సామాన్య మందుబాబుల పరిస్థితి ఏంటి? తలుచుకుంటేనే జాలేస్తుంది కదూ.. ఇదిలా ఉంటే లాక్‌డౌన్ ప్రారంభమైన దగ్గరినుండి మందు బాబులపై రకరకాల మీమ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.

లాక్‌డౌన్ తర్వాత బార్లు తెరిస్తే, అప్పుడే బార్‌లోకి అడుగుపెట్టిన ఓ మద్యం ప్రియుడి ఆనందం ఎలా ఉంటుంది అని తెలిపేలా ఓ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇది మలయాళీ సినిమాలోని సీన్. లోనికి అడుగుపెట్టగానే దేవాలయంలోకి ప్రవేశించిన ఫీలింగ్, ఇన్నాళ్లూ మిస్ అయిన ఛైర్లు, టేబుళ్లని ఆప్యాయంగా తడుముతూ ఫీల్ అయిపోవడం. బేరర్లనే బంధువులనుకోవడం.. ఎన్ని రోజులకొచ్చావన్నా అన్నట్టు యోగక్షేమాలు అడగడం.. పెగ్గు పోసేవాడు దేవుడిలా కనిపించడం.. అసలు వీడియో చూస్తే నవ్వాగదంటే నమ్మండి. ఇంకెదుకాలస్యం.. మరి మీరూ ఓ లుక్కెయ్యండి..