Bholaa : హమ్మయ్య 50 కోట్లు వచ్చింది.. అయినా నష్టాల్లోనే భోళా!

ఖైదీ సినిమాని భోళా (Bholaa) గా రీమేక్ చేస్తూ అజయ్ దేవగన్ ఇటీవల ఆడియన్స్ ముందుకు వచ్చాడు. అయితే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద..

Bholaa : హమ్మయ్య 50 కోట్లు వచ్చింది.. అయినా నష్టాల్లోనే భోళా!

Ajay Devgn Bholaa movie collections - Pic Source Twitter

Bholaa : పఠాన్ బ్లాక్ బస్టర్ హిట్టు అందుకోవడమే కాకుండా 1000 కోట్ల క్లబ్ లోకి కూడా అడుగుపెట్టడంతో బాలీవుడ్ కి మళ్ళీ మంచి రోజులు వచ్చాయి అని అందరూ అనుకున్నారు. కానీ ఆ సినిమా తరువాత కూడా పెద్ద మార్పు ఏమి కనిపించడం లేదు. సెల్ఫీ సినిమాతో వచ్చి అక్షయ్ కుమార్ (Akshay Kumar) ఆడియన్స్ ని థియేటర్ కి రప్పించకలేక ఇబ్బందులు పడ్డాడు. తాజాగా అజయ్ దేవగన్ (Ajay Devgn) కూడా అదే ఎదురుకుంటున్నాడు. రీసెంట్ గా అజయ్ దేవగన్ భోళా (Bholaa) సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాడు.

Preity Zinta : ప్రీతి జింటాకు చేదు అనుభవం.. కారును వెంబడించిన దివ్యాంగుడు

లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కార్తీ హీరోగా తెరకెక్కిన ఖైదీ సినిమాకి ఇది రీమేక్. కథలో కొన్నిమార్పులు చేసి అజయ్ దేవగనే ఈ సినిమాని డైరెక్ట్ చేశాడు. మార్చి 30న రిలీజ్ అయిన ఈ మూవీ చాలా కష్టపడి 53.58 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని అందుకుంది. స్టార్ హీరో సినిమా అయ్యుండి, దాదాపు 100 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం 6 రోజుల్లో కేవలం 25 కోట్ల షేర్ మాత్రమే కలెక్ట్ చేయడం చూస్తుంటే బాలీవుడ్ సినిమాలకు ఇంకా మంచి రోజులు వచ్చినట్లు లేవని అనిపిస్తుంది. మరో పక్క ఈ సినిమాతో పాటే రిలీజ్ అయిన నాని దసరా (Dasara) సినిమా మాత్రం కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది.

Pushpa 2 : పుష్ప గ్లింప్స్ లో ఇది గమనించారా.. స్టోరీ ఇదేనా?

5 రోజుల్లో ఈ సినిమా 92 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకొని 100 కోట్ల వైపు పరుగులు పెడుతుంది. అంతేకాదు ఈ సినిమా బ్రేక్ ఈవెన్ ని కూడా ఈ మూవీ ఆల్మోస్ట్ చేరుకుంది. ఇది ఇలా ఉంటే, భోళా ప్రమోషన్ లో అజయ్ దేవగన్ మాట్లాడుతూ.. భోళా యూనివర్స్ క్రియేట్ చేస్తాను అంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. కాగా బాలీవుడ్ ఆడియన్స్ తమ హీరోల నుంచి బయోపిక్స్ అండ్ రీమక్స్ కాకుండా ఒక ఫ్రెష్ అండ్ ఒరిజినల్ స్టోరీస్ కోరుకుంటున్నారు. పఠాన్ సినిమా ఇలా ఒరిజినల్ కంటెంట్ తో రావడమే ఆ మూవీ సక్సెస్ కి కారణమైంది.