Akhanda : నరసింహుడి సన్నిధిలో ‘అఖండ’

ఈ సినిమా విజయానంతరం చిత్ర యూనిట్ అన్ని ప్రముఖ దేవాలయాలని సందర్శిస్తున్నారు. తాజాగా యాదగిరి నరసింహ స్వామి ఆలయాన్ని దర్శించారు. హీరో బాలకృష్ణతో పాటు..................

Akhanda : నరసింహుడి సన్నిధిలో ‘అఖండ’

Akhanda Team

Akhanda :   బాలయ్య బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన ‘అఖండ’ సినిమా భారీ విజయం సాధించింది. ఈ సినిమాతో వీరి కాంబినేషన్లో హ్యాట్రిక్ కొట్టారు. కరోనా సెకండ్ వేవ్ తర్వాత 100 కోట్లకు పైగా కలెక్షన్స్ చేసి సరికొత్త రికార్డ్స్ సృష్టించి పరిశ్రమకి మంచి ఊపునిచ్చింది. బాలయ్య ఉగ్ర రూపం, బోయపాటి మాస్ టేకింగ్, తమన్ మ్యూజిక్, ఫైట్ సీన్స్ ఈ సినిమాకి బాగా ప్లస్ అయ్యాయి. దేశ విదేశాల్లోనూ ‘అఖండ’ భారీ విజయం సాధించింది.

Book My Show : BookMyShowలో 2021లో అత్యధికంగా బుక్ చేయబడిన టాప్ 10 సినిమాలు ఇవే…

ఈ సినిమా విజయానంతరం చిత్ర యూనిట్ అన్ని ప్రముఖ దేవాలయాలని సందర్శిస్తున్నారు. ఇప్పటికే సింహాచలం అప్పన్న, విజయవాడ కనకదుర్గ, మంగళగిరి పానకాల స్వామి దేవాలయాలని సందర్శించారు. తాజాగా యాదగిరి నరసింహ స్వామి ఆలయాన్ని దర్శించారు. హీరో బాలకృష్ణతో పాటు డైరెక్టర్ బోయపాటి శ్రీనివాస్, నిర్మాతలు యాదాద్రి శ్రీ లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకున్నారు. దేవరకద్ర ఎమ్మెల్యే వెంకటేశ్వర్ రెడ్డి ‘అఖండ’ సినిమా టీమ్‌ ని దగ్గరుండి దర్శనం చేయించారు. బాలకృష్ణకు ఆలయ అర్చకులు వేదాశీర్వచనం చేసి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.