Akshay Kumar : పరాజయంలో డబల్ హ్యాట్రిక్.. అక్షయ్‌కి ఏమైంది??

అక్షయ్ కుమార్ కి హౌస్ ఫుల్ 4, గుడ్ న్యూస్ సినిమాల తర్వాత చెప్పుకోదగ్గ హిట్టే పడలేదు. గత మూడేళ్ళలో అక్షయ్ నుంచి చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి. లక్ష్మీ, బెల్ బాటమ్, సూర్యవంశి, ఆత్రంగిరే, బచ్చన్ పాండే ఇలా వరసగా...............

Akshay Kumar : పరాజయంలో డబల్ హ్యాట్రిక్.. అక్షయ్‌కి ఏమైంది??

Akshay

Akshay Kumar :  సౌత్ సినిమాలను బాలీవుడ్ కి రీమేక్ చేయడంలో ముందుండే స్టార్ హీరో అక్షయ్ కుమార్. సంవత్సరానికి 4 సినిమాలకు తగ్గకుండా రిలీజ్ చేస్తూ పక్కా ప్లానింగ్ తో టైమ్ ను యుటిలైజ్ చేసుకునే అక్షయ్ కుమార్ ఇటీవల వరుసగా ఫ్లాపుల బాట పట్టారు. బాలీవుడ్ లో గ్యారెంటీ హీరోకి డబుల్ హాట్రిక్ ఫ్లాప్ లొచ్చాయి అనేది ఇప్పుడు పెద్ద చర్చగా మారింది.

అక్షయ్ కుమార్ కి హౌస్ ఫుల్ 4, గుడ్ న్యూస్ సినిమాల తర్వాత చెప్పుకోదగ్గ హిట్టే పడలేదు. గత మూడేళ్ళలో అక్షయ్ నుంచి చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి. లక్ష్మీ, బెల్ బాటమ్, సూర్యవంశి, ఆత్రంగిరే, బచ్చన్ పాండే ఇలా వరసగా రిలీజ్ అయిన సినిమాలు బాక్సాఫీసు ముందు బోల్తాపడి ఖిలాడికి బిగ్ షాక్ ఇచ్చాయి. దాంతో ఆశలన్నీ సామ్రాట్ పృథ్విరాజ్ మీదే పెట్టుకున్నారు అక్షయ్ కుమార్. భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ పీరియాడికల్ మూవీకి పాజిటివ్ టాక్ వచ్చినా కలెక్షన్లు లేక ఫ్లాప్ లిస్ట్ లో చేరిపోయింది. దీంతో అక్షయ్ కుమార్ ఫ్లాప్ లిస్ట్ డబుల్ హాట్రిక్ అయ్యింది.

Kajal Agarwal : కొడుకుతో ఫోటో షేర్ చేసిన కాజల్.. ఎంత ముద్దుగా ఉన్నాడో..

గత సినిమాల లాస్ అంతా పృథ్విరాజ్ తో సరిచేసుకుందామనుకున్న అక్షయ్ కుమార్ ఆశలన్నీ అడియాశలుగానే మిగిలిపోయాయి. వరసగా ఆరు ఫ్లాపులు కూడా అక్షయ్ లాంగ్ కెరీర్ లో మొదటి సారిగా నమోదైంది. అక్షయ్ కుమార్ ప్లానింగ్ మామూలుగా ఉండదు. అమలు చేయడంలోనూ అక్షయ్ కింగే. కాని, ఈ వరస సినిమాల ఫ్లాప్ విషయంలో ఎందుకు ఇలా జరిగింది అని హార్ట్ కోర్ ఫ్యాన్స్ తెగ ఫీలవుతున్నారు. సూర్యవంశీ లాంటి సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ బాగున్నా, పాజిటివ్ టాక్ వచ్చినా, కోవిడ్ ఆంక్షల మధ్య రిలీజ్ కావడంతో కలెక్షన్ల పరంగా డౌన్ ఫాల్ అయింది.

ఇంకా ఆత్రంగిరే సినిమాకి పాజిటివ్ టాకే వచ్చినా కమర్షియల్ గా సక్సెస్ కాలేదు. ఇక బెల్ బాటమ్, బచ్చన్ పాండే అక్షయ్ కుమార్ రేంజ్ ను తగ్గించే సినిమాలుగా నిలిచిపోయాయి. ఇంకా కొన్ని సినిమాలు కంటెంట్ వీక్ సినిమాలు కావడంతో అక్షయ్ కుమార్ కి బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపులొచ్చాయి. దాంతో ఆయన అభిమానులు అక్షయ్ కుమార్ కమ్ బ్యాక్ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం అక్షయ్ చేతిలో సూర్య నటించిన ఆకాశమే హద్దురా రీమేక్ తో పాటు, రామ్ సేతు, సెల్ఫీ, ఓమైగాడ్ 2 లాంటి సినమాలున్నాయి. మరి వీటిల్లో అక్షయ్ ఏ సినిమాతో హిట్ కొడతాడా చూడాలి.