Samantha-Akshay: సమంత ఇంట్లో అక్షయ్ దొంగతనం.. ఇదేం పాడు బుద్దని పోస్ట్!

టాలీవుడ్ స్టార్‌ హీరోయిన్‌ సమంత ఇప్పుడు విడాకుల తరువాత బాలీవుడ్ మీద స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తుంది. ఇప్పటికే అక్కడ సినిమాలను ఒకే చేస్తున్న సామ్ ఇప్పుడు ప్రకటనలలో కూడా నటిస్తుంది.

Samantha-Akshay: సమంత ఇంట్లో అక్షయ్ దొంగతనం.. ఇదేం పాడు బుద్దని పోస్ట్!

Samantha Akshay

Samantha-Akshay: టాలీవుడ్ స్టార్‌ హీరోయిన్‌ సమంత ఇప్పుడు విడాకుల తరువాత బాలీవుడ్ మీద స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తుంది. ఇప్పటికే అక్కడ సినిమాలను ఒకే చేస్తున్న సామ్ ఇప్పుడు ప్రకటనలలో కూడా నటిస్తుంది. కాగా.. తాజాగా సామ్ ఇంట్లో దొంగతనం జరిగింది. ఇదంతా సమంతకు తెలిసే జరిగింది. అంతేకాదు.. అర్ధరాత్రి దొంగను పట్టుకున్న ఆమె దొంగోడు తినడానికి ‘స్నాక్స్‌’ ప్యాకెట్‌ కూడా ఇచ్చింది. ఇదంతా సమంతా తాజా యాడ్ గురించి. ఈ దొంగతనం కుర్‌కురే యాడ్‌లో ఓ సన్నివేశం మాత్రమే.

Movie Releases: ఫిబ్రవరి సినిమాలూ కష్టమే.. మళ్ళీ తప్పని వాయిదాల పర్వం!

బాలీవుడ్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ బ్రాండ్‌ కుర్‌కుర్‌ స్నాక్స్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే కాగా ఇటీవలే సమంత కూడా ఈ కుర్‌కురే యాడ్‌లో నటించింది. తాజాగా విడుదలైన కుర్‌కురే యాడ్‌ లో అక్షయ్‌ కుమార్‌ సమంత ఇంట్లో దొంగతనానికి వెళ్తాడు. అక్కడ కుర్‌కురేను చూడగానే నోట్లో నీళ్లూరతాయి. వెంటనే అతడు ఆ ప్యాకెట్‌ను చేతుల్లొకి తీసుకోగానే సమంత ఫ్యామిలీ అక్కడికి వచ్చేస్తుంది. అక్షయ్‌ చేతిలోని ప్యాకెట్‌ను లాక్కుని ఫ్యామిలీ అంతా తింటూ ఉంటారు.

Krrish 4: మళ్ళీ డిసప్పాయింటేనా హృతిక్.. క్రిష్ 4 ఎప్పుడు సామి?!

అది చూసి ఉండబట్టలేకపోయిన అక్షయ్‌ తనకూ ఇవ్వమని కోరడంతో సామ్‌ ఆ ప్యాకెట్‌ను అతడికి ఇస్తుంది. వెంటనే ఆవురావురుమంటూ ప్యాకెట్‌ ఖాళీ చేస్తాడు అక్షయ్‌. ఇక వెళ్తానని సెలవు తీసుకుంటుండగా నీ కోసం బండి వస్తుందని చెప్తుంది సామ్‌. ఓహ్‌.. బండి కూడా ఇస్తారా? అని సంతోషించేలోపు పోలీస్‌ సైరన్‌ మోగుతుంది, అక్షయ్‌ ముఖం వాడిపోతుంది. ఈ యాడ్‌ను సామ్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిన సమంతా ‘సినిమాలో పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపించే హీరో కుర్‌కురే దొంగగా మారిపోయాడు. ఈ ప్రవర్తనేంటి అక్షయ్‌ కుమార్‌?’ అంటూ కొంటెగా ప్రశ్నించింది.

 

View this post on Instagram

 

A post shared by Samantha (@samantharuthprabhuoffl)