Alia Bhatt : బేబీ రాబోతుంది అంటూ పోస్ట్.. ఆలియా భట్ ప్రగ్నెంట్?.. కంగ్రాట్స్ చెప్తున్న సెలబ్రిటీలు..

బాలీవుడ్ హీరోయిన్ ఆలియాభట్ ఇటీవలే తన ప్రియుడు హీరో రణబీర్ కపూర్ ని పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం వీరిద్దరూ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఎవరి షూటింగ్స్ లో...........

Alia Bhatt : బేబీ రాబోతుంది అంటూ పోస్ట్.. ఆలియా భట్ ప్రగ్నెంట్?.. కంగ్రాట్స్ చెప్తున్న సెలబ్రిటీలు..

Alia

Alia Bhatt :  బాలీవుడ్ హీరోయిన్ ఆలియాభట్ ఇటీవలే తన ప్రియుడు హీరో రణబీర్ కపూర్ ని పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం వీరిద్దరూ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఎవరి షూటింగ్స్ లో వాళ్ళు బిజీగా ఉన్నారు. ఇద్దరూ కలిసి త్వరలోనే బ్రహ్మాస్త్ర సినిమాతో ప్రేక్షకుల ముందుకి రానున్నారు. ఆలియా పెళ్లి అయి ఇంకా మూడు నెలలు కూడా పూర్తి కాలేదు. తాజాగా ఆలియా పెట్టిన పోస్ట్ అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

Maruthi : ప్రజారాజ్యం పార్టీకోసం పనిచేశాను.. డైరెక్టర్ గా ఫస్ట్ యాక్షన్ చెప్పింది చిరంజీవి గారికే..

ఆలియా ఒక హాస్పిటల్ లో చెకప్ చేయించుకుంటున్న ఫోటోని పోస్ట్ చేసి.. మా బేబీ త్వరలో రాబోతుందని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దాని పక్కన రెండు సింహాలు ఇంకో చిన్న సింహం ఉన్న ఫోటో కూడా పోస్ట్ చేసింది. దీంతో ఆలియా ప్రెగ్నెంట్ అని చెప్పేసింది. త్వరలో ఆలియా తల్లి కాబోతుంది. ఈ విషయం తెలిసి ఇంత త్వరగానా అంటూ కొంతమంది ఆశ్చర్యపోతుంటే మరి కొంతమంది కంగ్రాట్స్ చెప్తున్నారు. కెరీర్ లో ఫుల్ బిజీగా ఉన్న టైంలో ఇలా ఆలియా ప్రెగ్నెన్సీ అని అనౌన్స్ చేయడం చాలా మందికి ఆశ్చర్యం కలిగిస్తుంది.