Naresh59: అల్లరోడి కొత్త సినిమా.. మళ్ళీ ఫామ్ లోకి వచ్చినట్లే!

ఇప్పుడంటే అందరూ కామెడీ టైమింగ్ లో చాలా పర్ఫెక్ట్ ఉన్నారు కానీ ఇంతకు ముంది తెలుగులో కామెడీ టైమింగ్ ఎక్కువ ఉండే హీరోలలో అల్లరి నరేష్ ముందుంటాడు.

Naresh59: అల్లరోడి కొత్త సినిమా.. మళ్ళీ ఫామ్ లోకి వచ్చినట్లే!

Naresh59

Naresh59: ఇప్పుడంటే అందరూ కామెడీ టైమింగ్ లో చాలా పర్ఫెక్ట్ ఉన్నారు కానీ ఇంతకు ముంది తెలుగులో కామెడీ టైమింగ్ ఎక్కువ ఉండే హీరోలలో అల్లరి నరేష్ ముందుంటాడు. మీడియం బడ్జెక్టు తో నరేష్ తో సినిమా చేస్తే తమ డబ్బు ఎక్కడకి పోదనే టాక్ ఉండేది అప్పట్లో నిర్మాతల్లో. అందుకే సినిమాల మీద సినిమాలకు సైన్ చేస్తూ ఫుల్ బిజీగా ఉండేవాడు నరేష్. ఏడాది ఏడెనిమిది సినిమాలు రిలీజ్ చేసిన క్రెడిట్ కూడా నరేష్ సొంతం.

Celebrities Divorce: విడాకులందు.. సినిమా వాళ్ళ విడాకులు వేరయా!

అయితే.. కథల ఎంపిక, పేరడీలు ఎక్కువ అవడంతో ప్రేక్షకులకు ఆ కామెడీ మొహం మొత్తేసింది. దీంతో కాస్త విరామం తీసుకున్న నరేష్ ఈసారి కామెడీని మించి కథలే బలంగా సినిమాలతో వస్తున్నాడు. అలా గత ఏడాది వచ్చింది నాంది. ఓ సీరియస్ కథాంశంతో వచ్చిన నాంది నరేష్ తో పాటు కొత్త దర్శకుడు విజయ్ కనకమేడలకు సక్సెస్ ఇచ్చింది. ఈ కథను మెచ్చిన బాలీవుడ్ ఇప్పుడు రీమేక్ చేస్తుంది.

Jr NTR: ముహూర్తం పెట్టేసిన యంగ్ టైగర్.. ఇక నాన్ స్టాప్ లెక్కే!

కాగా, ప్రస్తుతం నరేష్ ‘సభకు నమస్కారం’ అనే సైటిరికల్ పొలిటికల్ థ్రిల్లర్ తో రాబోతున్నాడు. నాంది ఇచ్చిన సక్సెస్ తో మళ్ళీ ఫామ్ లోకి వచ్చిన నరేష్ తన కెరీర్ లో 59వ సినిమాను కూడా మొదలుపెట్టేశాడు. మంగళవారం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించిన ఈ సినిమాకు ఎ.రాజ మోహన్ దర్శకత్వం వహించనుండగా తెలుగమ్మాయి ఆనంది హీరోయిన్ గా నటించనుంది. రాబోయే ఈ రెండు సినిమాలు కూడా సక్సెస్ కొడితే నరేష్ మళ్ళీ పూర్వవైభవం పొందాం గ్యారంటీకి కనిపిస్తుంది.