Allu Arha: మహేష్ బాబు సినిమాలో అల్లు అర్హ.. త్రివిక్రమ్ భలే సెట్ చేశాడుగా!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రాన్ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ తొలి షెడ్యూల్ ఇప్పటికే పూర్తవగా, ఇప్పుడు రెండో షెడ్యూల్ కోసం చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. ఇక ఈ సినిమాను త్రివిక్రమ్ పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దేందుకు రెడీ అవుతున్నాడు. ఈ క్రమంలోనే ఈ సినిమాలో భారీ క్యాస్టింగ్ ఉండబోతున్నట్లు చిత్ర వర్గాలు చెబుతున్నాయి.

Allu Arha: మహేష్ బాబు సినిమాలో అల్లు అర్హ.. త్రివిక్రమ్ భలే సెట్ చేశాడుగా!

Allu Arha To Act In Mahesh Babu Trivikram Movie

Allu Arha: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రాన్ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ తొలి షెడ్యూల్ ఇప్పటికే పూర్తవగా, ఇప్పుడు రెండో షెడ్యూల్ కోసం చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. ఇక ఈ సినిమాను త్రివిక్రమ్ పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దేందుకు రెడీ అవుతున్నాడు. ఈ క్రమంలోనే ఈ సినిమాలో భారీ క్యాస్టింగ్ ఉండబోతున్నట్లు చిత్ర వర్గాలు చెబుతున్నాయి.

Allu Arha : ‘కచ్చా బాదమ్’ పాటకి అల్లు అర్హ క్యూట్ స్టెప్స్.. మై లిటిల్ బాదం అంటూ షేర్ చేసిన బన్నీ

ఇప్పటికే మహేష్ బాబు సరసన అందాల భామ పూజా హెగ్డే ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. కాగా, మరో హీరోయిన్‌గా యంగ్ బ్యూటీ శ్రీలీలను తీసుకునేందుకు త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నాడు. అంతేగాక పలువురు సీనియర్ నటీనటులు కూడా ఈ సినిమాలో నటించబోతున్నారట. అయితే తాజాగా ఈ జాబితాలో మరో స్టార్ కిడ్ కూడా యాడ్ అయ్యినట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించబోతున్నట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

Mahesh Babu : మళ్ళీ వెకేషన్‌కి వెళుతున్న మహేష్.. SSMB28 షూటింగ్ మొదలయ్యేది ఎప్పుడు?

అల్లు అర్హ సోషల్ మీడియాలో ఎంత పాపులర్ అనేది అందరికీ తెలిసిందే. ఇక సమంత లీడ్ రోల్‌లో చేస్తున్న ‘శాకుంతలం’ సినిమాలో ఓ చిన్న పాత్రలో అల్లు అర్హ నటిస్తోంది. దీంతో త్రివిక్రమ్ ఈ సినిమాలో ఓ ప్రత్యేక పాత్రను అల్లు అర్హ కోసం రాసుకున్నాడని.. ఆ పాత్రలో అర్హను యాక్ట్ చేయించాల్సిందిగా బన్నీని కోరాడట ఈ డైరెక్టర్. త్రివిక్రమ్ రిక్వెస్ట్‌ను బన్నీ వెంటనే ఓకే చేశాడట. మరి మహేష్ బాబు లాంటి స్టార్ హీరో సినిమాలో అల్లు అర్హకు త్రివిక్రమ్ ఎలాంటి ప్రాముఖ్యత ఉన్న పాత్రను ఇస్తాడా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు.