Allu Arjun : బుల్లితెరపై సందడి చేయనున్న ఐకాన్ స్టార్.. అభిమానులకి పండగే

టెలివిజన్లో వచ్చే షోలలో జడ్జెస్ గానో, గెస్ట్ గానో వస్తూ ఉంటారు. అలా చాలా మంది హీరోలు, హీరోయిన్స్ ఇప్పటికే బుల్లితెరపై మెరిపించారు. తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బుల్లితెరపై....

Allu Arjun : బుల్లితెరపై సందడి చేయనున్న ఐకాన్ స్టార్.. అభిమానులకి పండగే

Aa

Allu Arjun :  స్టార్ హీరోలు, హీరోయిన్స్ వెండితెరపైనే కాకుండా అప్పుడప్పుడు బుల్లితెరపైన కూడా మెరిపిస్తూ ఉంటారు. టెలివిజన్లో వచ్చే షోలలో జడ్జెస్ గానో, గెస్ట్ గానో వస్తూ ఉంటారు. అలా చాలా మంది హీరోలు, హీరోయిన్స్ ఇప్పటికే బుల్లితెరపై మెరిపించారు. తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బుల్లితెరపై సందడి చేయనున్నారు.

Puneeth Rajkumar : త్వరలో పునీత్ బయోపిక్.. నా శక్తి మేరకు ట్రై చేస్తానంటూ దర్శకుడు ప్రకటన

ఓ ఛానల్ లో వచ్చే డ్యాన్స్ షో ‘ఢీ’ చివరి దశకు చేరుకోనుంది. త్వరలోనే ‘ఢీ’ గ్రాండ్ ఫైనల్ జరగనుంది. ఈ డ్యాన్స్ షోకి ఫైనల్ ఎపిసోడ్లో ప్రతి సంవత్సరం ఎవరో ఒకర్ని గెస్ట్ గా తీసుకొస్తారు. గతంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా వచ్చి సందడి చేశారు. ప్రస్తుతం ‘ఢీ’ 13వ సీజన్ జరుగుతుంది. ఈ సీజన్ ఫైనల్ ఎపిసోడ్ కి ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ గెస్ట్ గా రానున్నాడు.

Bigg Boss 5 : బిగ్‌బాస్ 5 హోస్ట్‌గా శృతి హాసన్?

అల్లుఅర్జున్ ఎంత మంచి డ్యాన్సర్ అనేది మన అందరికి తెలుసు. అంత గొప్ప డ్యాన్సర్ డ్యాన్స్ షోకి గెస్ట్ గా వస్తున్నాడు ఫైనల్ ఎపిసోడ్ కి అంటే టిఆర్పి బద్దలవ్వాల్సిందే. ఇక అభిమానులకి వాళ్ళ హీరో టీవిలో కూడా రాబోతున్నాడు అంటే పండగే. అందుకే అల్లుఅర్జున్ అభిమానులతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని డ్యాన్సర్స్ అంతా ఈ ఫైనల్ ఎపిసోడ్ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.