Allu Arjun : హాట్‌గా ఉన్నావంటూ ప్రియమణికి షాక్ ఇచ్చిన బన్నీ

ఈ షోలో మొదటి నుంచి ఉన్న జడ్జిలలో ప్రియమణి ఒకరు. ప్రియమణి బన్నీతో మీతో ఒక్కసారి కూడా వర్క్ చేయలేదని నాకు చాలా బాధగా ఉంది అని అంది. దీనికి బన్నీ గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు. ప్రియమణి...

Allu Arjun : హాట్‌గా ఉన్నావంటూ ప్రియమణికి షాక్ ఇచ్చిన బన్నీ

Bunny

Allu Arjun :  హీరో హీరోయిన్స్ ఒకరి మీద ఒకరి కాంప్లిమెంట్స్ ఇచ్చుకోవడం మామూలే. కానీ ఈ కాంప్లిమెంట్ అందరి ముందు ఇచ్చేసరికి ఆ హీరోయిన్ కూడా షాక్ అయింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం తన ‘పుష్ప’ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. ఈ ప్రమోషన్స్ లో భాగంగానే ఇటీవల అన్ని ఫంక్షన్స్ కి గెస్ట్ గా వెళ్తున్నాడు. తాజాగా డ్యాన్స్ షో ‘ఢీ’కి కూడా గెస్ట్ గా వెళ్ళాడు. ‘ఢీ’ ఫైనల్ ఎపిసోడ్ కి అల్లు అర్జున్ గెస్ట్ గా వెళ్లారు. ఇటీవల దీనికి సంబంధించిన ప్రోమో రిలీజ్ చేశారు. షోలో అందరి మీద జోక్స్ వేస్తూ అందరితో సరదాగా ఉన్నాడు బన్నీ.

Akhanda Ramakrishna : అఖండ సినిమా చూస్తూ ప్రముఖ సినీ ఎగ్జిబిటర్ మృతి

అయితే ఈ షోలో మొదటి నుంచి ఉన్న జడ్జిలలో ప్రియమణి ఒకరు. ప్రియమణి బన్నీతో మీతో ఒక్కసారి కూడా వర్క్ చేయలేదని నాకు చాలా బాధగా ఉంది అని అంది. దీనికి బన్నీ గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు. ప్రియమణి చెప్పిన దానికి బన్నీ మీరు అస్సలు అలా అనుకోకండి, ఇప్పటికీ ఇంకా చాన్స్‌ ఉంది. మీతో ఎప్పుడైనా వర్క్‌ చేస్తాను. పైగా మీరు ఇప్పుడు ఇంకా సన్నబడి హాట్‌గా తయారయ్యారు అని అనడంతో ప్రియమణితో సహా అక్కడి వారంతా షాక్ అయ్యారు. ఆ తర్వాత ప్రియమణి దీన్ని కంప్లిమెంట్ గా తీసుకొని అల్లు అర్జున్ ని మెచ్చుకొని నవ్వేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి ప్రియమణికి బన్నీ నిజంగానే ఛాన్స్ ఇస్తాడేమో చూడాలి.