ఎన్నాళ్లు బతుకుతామో తెలీదు.. Puneeth మృతిపై ఎమోషనల్ అయిన అల్లు అర్జున్, విజయ్

పునీత్ అన్నని నేను రెండు మూడు సార్లు కలిశాను. ఆయన మరణ వార్త నన్ను చాలా డిస్ట్రబ్ చేసింది. మృత్యువు ఎప్పుడొస్తుందో తెలీదు. అందరినీ ప్రేమించండి. గొడవలు, పంతాలు, పట్టింపులు ఏమీ

ఎన్నాళ్లు బతుకుతామో తెలీదు.. Puneeth మృతిపై ఎమోషనల్ అయిన అల్లు అర్జున్, విజయ్

Puneeth Rajkumar Allu Arjun

Puneeth Rajkumar : కన్నడ ‘పవర్‌స్టార్‌’ పునీత్‌ రాజ్‌కుమార్‌ మరణంతో చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలముకున్నాయి. జిమ్ చేస్తూ గుండెపోటు శుక్రవారం పునీత్‌ మరణించడాన్ని సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు, అభిమానులు సైతం జీర్ణించుకోలేకపోతున్నారు. పునీత్ రాజ్‌కుమార్‌ అకాల మరణం ఎంతో మందికి తీరని శోకం మిగిల్చింది.

Covid-19 Origins : కొవిడ్ పుట్టుక.. వైరస్ మూలాలను ఎప్పటికీ గుర్తించ‌లేం.. జీవాయుధం కానేకాదు!

అభిమానులు, కుటుంబసభ్యులు, సన్నిహితులు శోకసంద్రంలో మునిగిపోయారు. వాళ్లు ఇంకా షాక్ లోనే ఉన్నారు. 46ఏళ్ల పునీత్, ఫిట్ నెస్ కి మారుపేరు అయిన పునీత్.. గుండెపోటుతో చనిపోయాడంటే అస్సలు నమ్మలేకపోతున్నారు. నిత్యం జిమ్ లో కసరత్తులు, రెగులర్ గా వ్యాయామం చేసే పునీత్ కు గుండెపోటు రావడం ఏంటని విస్తుపోతున్నారు.

పునీత్ మృతిపై టాలీవుడ్ హీరోలు అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ ఎమోషనల్ అయ్యారు. పుష్పక విమానం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో పునీత్ రాజ్ కుమార్ గురించి అల్లు అర్జున్ కామెంట్స్ చేశారు. ”పునీత్ నాకు ఎప్పటి నుంచో తెలుసు. చాలాసార్లు కలుస్తూ వుంటాము. మా ఇంటికి వచ్చేవారు. భోజనం చేసేవాళ్లం. ఎన్నోసార్లు ఇంటికి వచ్చారు. నేను బెంగళూరు వెళ్లినప్పుడు  కలిసాను. ఎన్నో ఫంక్షన్స్ లో కలిశాము. బెంగళూరుకి రావాలని ఆహ్వానించేవారు. ఆయన మరణ వార్త విని షాక్ అయ్యాను. లైఫ్ అనేది అన్ ప్రిడక్ట్ బుల్. లైఫ్ లో హ్యాపీ గా వుండండి. పునీత్ ఇక లేరన్న వార్త నన్ను కలిచివేసింది. గంట గంటకు బాధ పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. జీవితంలో దేన్నీ ఊహించలేము. ఉన్నంతవరకు ఆనందంగా ఉందాం. ” అని అల్లు అర్జున్ అన్నారు.

Disease Attack : యువతపై జబ్బుల దాడి… చిన్న వయస్సులోనే మరణం అంచులకు..

”పునీత్ అన్నని నేను రెండు మూడు గంటలు కలిశాను. ఆయన ఇంటికి పిలిచారు. ఆయన ఇంటికి వెళ్లి రెండు మూడు గంటలు గడిపా. ఆయన మరణ వార్త నన్ను చాలా డిస్ట్రబ్ చేసింది. మృత్యువు ఎప్పుడొస్తుందో తెలీదు. అందరినీ ప్రేమించండి. గొడవలు, పంతాలు, పట్టింపులు ఏమీ లేకుండా హ్యాపీగా ఉందాం. ఎన్నాళ్లు బతుకుతామో తెలీదు. ఉన్నంతకాలం ఆనందంగా ఉందాం” అని విజయ్ దేవరకొండ అన్నారు.