45 ఏళ్ళ అల్లూరి సీతారామరాజు

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మొట్టమొదటి స్కోప్, తొలి డీటీఎస్, తొలి 70ఎమ్.ఎమ్.సినిమాగా అల్లూరి సీతారామరాజు చరిత్ర సృష్టించింది..

  • Published By: sekhar ,Published On : May 1, 2019 / 01:00 PM IST
45 ఏళ్ళ అల్లూరి సీతారామరాజు

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మొట్టమొదటి స్కోప్, తొలి డీటీఎస్, తొలి 70ఎమ్.ఎమ్.సినిమాగా అల్లూరి సీతారామరాజు చరిత్ర సృష్టించింది..

సూపర్ స్టార్ కృష్ణ కెరీర్‌లో మరపురాని చిత్రం, తెలుగు చలనచిత్ర చరిత్రలో తనకంటూ ప్రత్యేకంగా ఒక పేజీని సృష్టించుకున్న చిత్రం.. అల్లూరి సీతారామరాజు.. ఈ సినిమా నిర్మాణం ఒక సాహసం, ఆ సాహసాన్ని ఇంటిపేరుగా మార్చుకున్న కృష్ణ, మన్యం వీరుడు అల్లూరిగా తెరపై మెరిస్తే, ప్రేక్షకలోకం మురిసిపోయింది. వి.రామచంద్ర రావు దర్శకత్వంలో, పద్మాలయా స్టూడియోస్ పతాకంపై, కృష్ణ సోదరులు జి.హనుమంత రావు, జి.ఆదిశేషగిరి రావు నిర్మించిన విప్లవాత్మక చిత్రం అల్లూరి సీతారామరాజు.. మే డే కానుకగా.. 1974 మే 1న విడుదలైంది. 2019 మే 1నాటికి ఈ చిత్రం విడుదలై విజయవంతంగా 45 సంవత్సరాలు..
Also Read : లీకైన వరుణ్ ‘వాల్మీకి’ లుక్

హీరోగా కృష్ణ 100వ సినిమా ఇది.. తెల్లవారిని తరిమికొట్టిన మన్యం వీరుడి గురించి కథలుగా విన్నవాళ్ళు, చరిత్రలో చదువుకున్న వాళ్ళే గానీ, కళ్ళారా చూసిన వారు ఎవరూ లేరు. ఈ సినిమా ద్వారా అల్లూరి అంటే కృష్ణలానే ఉంటాడేమో అన్నంతగా ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసారాయన. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మొట్టమొదటి స్కోప్, తొలి డీటీఎస్, తొలి 70ఎమ్.ఎమ్.సినిమాగా అల్లూరి సీతారామరాజు చరిత్ర సృష్టించింది. కృష్ణ, విజయ నిర్మల జంట ప్రేక్షకులకు కన్నుల పంట.. నిర్మాణంలో, విడుదలలో, కలెక్షన్లలో విప్లపం.. అల్లూరి సీతారామరాజు చిత్రం.. త్రిపురనేని మహారథి రచన, ఆదినారాయణ రావ్ సంగీతం, వి.ఎస్.ఆర్.స్వామి ఫోటోగ్రఫీ సినిమాకి ప్లస్ అయ్యాయి.

తెలుగు వీర లేవరా, వస్తాడు నారాజు ఎవర్ గ్రీన్ పాటలు. జగ్గయ్య, గుమ్మడి, ప్రభాకర్ రెడ్డి, రావుగోపాల రావు, రాజబాబు, చంద్ర మోహన్ తదితరులు నటించిన అల్లూరి సీతారామరాజు, కృష్ణ సినీ ప్రస్థానంలో ఒక మైలు రాయిగా నిలిచిపోవడమే కాక, తెలుగు సినీ పరిశ్రమని సాంకేతికంగా ముందడుగు వేయించిన చిత్రంగా చిరస్మరణీయంగా మిగిలిపోతుంది.
Also Read : రాధిక రచ్చ మామూలుగా లేదుగా! మార్కెట్ రాజా M.B.B.S.-ఫస్ట్ లుక్

వాచ్, వస్తాడు నారాజు సాంగ్..