Ira Khan : ప్రేమించినవాడితో ఘనంగా అమీర్‌ఖాన్ కూతురి నిశ్చితార్థం..

అమీర్ ఖాన్ కూతురిగా ఐరా ఖాన్ అందరికి సుపరిచితమే. ఇక సోషల్ మీడియాలో తాను పెట్టే హాట్ హాట్ ఫొటోలతో మరింత పాపులారిటీని సంపాదించుకుంది ఐరా ఖాన్. ఇటీవల...............

Ira Khan :  ప్రేమించినవాడితో ఘనంగా అమీర్‌ఖాన్ కూతురి నిశ్చితార్థం..

Ameer Khan Daughter Ira Khan engagement with her Boyfriend nupur shikare

Ira Khan :  అమీర్ ఖాన్ కూతురిగా ఐరా ఖాన్ అందరికి సుపరిచితమే. ఇక సోషల్ మీడియాలో తాను పెట్టే హాట్ హాట్ ఫొటోలతో మరింత పాపులారిటీని సంపాదించుకుంది ఐరా ఖాన్. ఇటీవల తన పుట్టిన రోజు వేడుకల్ని బికినీ వేసుకొని సెలెబ్రేట్ చేసుకొని వివాదంలో కూడా చిక్కుకుంది. ఇక ఐరా ఖాన్ గత రెండేళ్లుగా నుపుర్ శిఖర్ అనే వ్యక్తితో డేటింగ్ చేస్తుంది.

ఫిట్‌నెస్ ట్రైనర్, సైక్లిస్ట్ అయిన నుపుర్ తో ఐరా గత రెండేళ్లుగా ప్రేమలో ఉంది. ఇటీవల ఓ సైక్లింగ్ ఈవెంట్ లో నుపుర్ ఉంగరం తీసుకొచ్చి మోకాళ్ళ మీద కూర్చొని పెళ్లి చేసుకుందామా అని అడిగితే ఐరా లిప్ కిస్ ఇచ్చి మరీ ఓకే చెప్పింది. ఈ వీడియో బాగా వైరల్ అయింది. తాజాగా వీరిద్దరూ నిశ్చితార్థం చేసుకున్నారు. ఐరా, నుపూర్ ప్రేమ‌కు ఇరు కుటుంబాలు ఓకే చెప్పడంతో వారి నిశ్చితార్థం ఘ‌నంగా జ‌రిగింది.

Roja : కూతురి సినీ ఎంట్రీపై రోజా వ్యాఖ్యలు..

బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ కూతురు ఐరా ఖాన్ నిశ్చితార్థ వేడుక‌లు ముంబైలో ఘ‌నంగా జ‌రిగాయి. ఈ ఎంగేజ్మెంట్ లో ఐరా రెడ్ గౌనులో మెరిసిపోతుంటే నుపుర్ శిఖర్ బ్లాక్ సూట్ ధరించాడు. ఈ నిశ్చితార్థ వేడుకల్లో అమీర్ ఖాన్ కుటుంబ సభ్యులతో పాటు పలువురు బాలీవుడ్ ప్రముఖులు కూడా పాల్గొన్నారు. సోషల్ మీడియా వేదికగా ఈ కొత్త జంటకి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్టు సమాచారం.