Anasuya : వివాదంలో అనసూయ.. వందేమాతరం నిల్చొని పాడలేదంటూ..

రిపబ్లిక్​ డే సందర్భంగా అనసూయ జాతీయ గేయం 'వందేమాతరం' నిల్చొని పాడకుండా కుర్చీలో కూర్చొని కాలుపై కాలు వేసుకొని పాడింది. అనసూయ పాడిన వీడియోని ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ.........

Anasuya : వివాదంలో అనసూయ.. వందేమాతరం నిల్చొని పాడలేదంటూ..

Anasuya

Anasuya :  ఒకవైపు యాంకర్ గా, మరో వైపు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా దూసుకుపోతుంది అనసూయ. ఇటీవలే ‘పుష్ప’ సినిమాలో ద్రాక్షాయని క్యారెక్టర్ తో అందర్నీ మెప్పించింది. ఇక సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటుంది అనసూయ. తన బోల్డ్ ఫొటోషూట్స్ తో నెటిజన్లను అలరిస్తుంది కూడా. వీటితో పాటు అప్పుడప్పుడు వివాదాల్లో కూడా చిక్కుకుంటుంది అనసూయ. ప్రతి సారి ఏదో ఒక వివాదంలో చిక్కుకోవడం, దానిపై కౌంటర్లు ఇవ్వడం అనసూయకి అలవాటైపోయింది. తాజాగా మరో వివాదంలో చిక్కుకుంది అనసూయ.

 

రిపబ్లిక్​ డే సందర్భంగా అనసూయ జాతీయ గేయం ‘వందేమాతరం’ నిల్చొని పాడకుండా కుర్చీలో కూర్చొని కాలుపై కాలు వేసుకొని పాడింది. అనసూయ పాడిన వీడియోని ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపింది. అయితే ఈ వీడియోని నెటిజన్లు ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. జాతీయ గేయం అయినా, జాతీయ గీతం అయినా, ఎలాంటి దేశభక్తి సాంగ్స్ అయినా నిల్చొని పాడాలి. ఈ మాత్రం తెలీదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అంతే కాకుండా ఈ వీడియోలో అనసూయ గాంధీ బొమ్మ ఉన్న టీషర్ట్ వేసుకుంది. దీంతో అసలు రిపబ్లిక్ డేకి గాంధీకి సంబంధం ఏంటి అంబేద్కర్ వల్ల కదా రిపబ్లిక్ డే జరుపుకుంటున్నాము అంటూ కొంతమంది కామెంట్స్ చేశారు. ఇలా చాలా మంది ఈ రెండిటిని ట్రోల్ చేస్తూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేశారు.

Ram Charan : నాన్న గారి మెసెంజర్‌‍గా వచ్చాను

దీంతో అనసూయ వీటికి గట్టిగానే రిప్లై ఇచ్చింది. ఇలాంటివి నిల్చొని పాడాలి అని అన్నవారికి ”నేనే సారీ చెబుతున్నా. ఇదంతా చూస్తుంటే నేను నిల్చోకుండా పాడినందుకు చాలా మంది హర్ట్​ అయినట్టున్నారు. కానీ అది మీకు ఏదైనా అర్థాన్ని ఇస్తే, నిలబడి గౌరవం చూపించాల్సిన అవసరం ఉంది. ఇలాంటి దేశభక్తి గీతాలన్నిటికి నేను గౌరవం ఇస్తాను అని పోస్ట్ చేసింది.

Lahari Shari : ఖరీదైన BMW బైక్ కొనుగోలు చేసిన బిగ్‌బాస్ భామ

అలాగే టీషర్ట్​పై గాంధీ బొమ్మపై వచ్చిన కామెంట్లకు ”అరే ఏందిరా బై మీ లొల్లి.. నేషనల్ ఆంథమ్ అంటారు. గాంధీకి రాజ్యాంగానికి సంబంధం ఏంటని అంటారు. మరి జనగణమణ ఏంది? ఆగస్ట్​ 15, 1947 తర్వాతే జనవరి 26, 1950 అయింది. కొంచెం బుర్ర అద్దెకు తెచ్చుకోనన్నా మాట్లాడండి. హ్యాపీ రిపబ్లిక్​ డే” అని అనసూయ తన స్టోరీ లో పోస్ట్ చేసింది. అయితే అనసూయ ఇచ్చిన సమాధానాలను కూడా మళ్ళీ ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు.