Anchor Suma : ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా సుమ ఈ ఈవెంట్ చేసింది | Anchor Suma doing event without remuneration

Anchor Suma : ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా సుమ ఈ ఈవెంట్ చేసింది

ఈ సినిమా నిర్మాత శ్రావ్య మాట్లాడుతూ.. ''చిరంజీవిగారిని క‌లిస్తే ఆయ‌న వ‌స్తాన‌ని చెప్పారు, కానీ కోవిడ్ వ‌ల్ల రాలేక‌పోయారు. రామ్‌చ‌ర‌ణ్‌ను పంపించారు. మీరు వ‌చ్చి సపోర్ట్ చేసినందుకు..

Anchor Suma : ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా సుమ ఈ ఈవెంట్ చేసింది

Anchor Suma :  టాలీవుడ్‌ టాప్ యాంక‌ర్‌గా సుమ‌ ఎంత బిజీనో అందరికి తెలుసు. స్టార్ హీరోలు సైతం సినిమా ఫంక్షన్స్ కి ఆమె డేట్స్ కోసం వెయిట్ చేస్తుంటారు. ఆమె క్రేజ్ అలాంటిది. ఈవెంట్ ఏదైనా సరే సుమ యాంకరింగ్ చేస్తే దానికి ఇంకాస్త హైప్ వచ్చినట్టే. ఇక సినిమా ఫంక్షన్స్ కి సుమ లక్షల్లోనే రెమ్యునరేషన్ తీసుకుంటుంది. నిర్మాతలు కూడా ఆమె అడిగినంత ఇవ్వడానికి రెడీగా ఉంటారు. అయితే తాజాగా ఓ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఒక్క రూపాయి కూడా రెమ్యునరేషన్ తీసుకోకుండా చేసిందట.

 

కీర్తి సురేష్ ముఖ్య పాత్రలో నటించిన ‘గుడ్ ల‌క్ స‌ఖి’ సినిమా జనవరి 28న రిలీజ్ కానుంది. నిన్న ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌ హైదరాబాద్ లో జరిగింది. ఈ ఈవెంట్ కి ముఖ్య అతిధిగా చిరంజీవి వస్తారని తెలిపారు కానీ ఆయనకి కరోనా రావటంతో రామ్ చరణ్ అతిధిగా వచ్చారు. ఈ సినిమాని సుధీర్ చంద్ర, శ్రావ్య వ‌ర్మ కలిసి నిర్మిస్తున్నారు. నిన్న జరిగిన ఫంక్షన్ లో నిర్మాత శ్రావ్య మాట్లాడుతూ ఈ విషయాన్ని తెలియచేసింది.

RGV : నాకు 50 వేలు ఇవ్వకుండా ఆర్జీవీ మోసం చేశారు : మహేశ్వరి

ఈ సినిమా నిర్మాత శ్రావ్య మాట్లాడుతూ.. ”చిరంజీవిగారిని క‌లిస్తే ఆయ‌న వ‌స్తాన‌ని చెప్పారు, కానీ కోవిడ్ వ‌ల్ల రాలేక‌పోయారు. రామ్‌చ‌ర‌ణ్‌ను పంపించారు. మీరు వ‌చ్చి సపోర్ట్ చేసినందుకు థ్యాంక్స్‌. ఇక సుమ విష‌యానికి వ‌స్తే శ్రేయాస్ మీడియా ఆమెను క‌ల‌వ‌గానే స‌రేన‌ని అంగీక‌రించింది. ఆమె ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ప్రీరిలీజ్ ఈవెంట్‌కు వ‌చ్చి ఈ సినిమాకు స‌పోర్ట్ చేసింది” అని తెలిపింది.

Hardik Pandya : ‘పుష్ప’ ఫీవర్.. నానమ్మతో కలిసి స్టెప్పులేసిన హార్దిక్ పాండ్య

ఆమె స్పీచ్ అయిపోయాక సుమ దీనికి కౌంటర్ గా.. ”ఇంకాసేపు ఉంటే నా ఆస్తి వివ‌రాల‌న్నీ కూడా చెప్పేలా ఉన్నావే. నెక్స్ట్ సినిమాలు చేస్తావ్ క‌దా, అప్పుడు అన్నీ క‌లిపి తీసుకుంటానులే’ అని నవ్వుతూ సెటైర్ వేసింది సుమ‌. అయితే నిర్మాత శ్రావ్య చాలా కాలంగా సినీ పరిశ్రమలో ఫ్యాషన్ డిజైనర్ గా ఉంది. సుమతో ఉన్న స్నేహంతోనే సుమ ఈ ఈవెంట్ కి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా చేసినట్లు తెలుస్తుంది.

×