Anee Master : బిగ్ బాస్ 11 వారాలకి యాని మాస్టర్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా??

ఒక పక్క స్టార్ హీరోల సినిమాలకు కొరియోగ్రఫీ చేస్తూ, మరో పక్క షోస్ లో హడావిడి చేస్తూ బుల్లి తెరపై అలరిస్తున్న యాని మాస్టర్ కి బిగ్ బాస్ షో నిర్వాహకులు....

Anee Master : బిగ్ బాస్ 11 వారాలకి యాని మాస్టర్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా??

Anee Master

Anee Master :  బిగ్‌బాస్‌ తెలుగు ఐదో సీజన్‌ 11 వారాలు పూర్తి చేసుకుంది. 19 మందితో మొదలైన బిగ్ బాస్ లో ఒక్కో వారం ఒక్కో కంటెస్టెంట్ ఎలిమినేట్ అయిపోతూ వస్తున్నారు. ఈ వారం యానీ మాస్టర్ ఎలిమినేట్ అయింది. ప్రస్తుతం హౌస్ లో 8 మంది ఉన్నారు. కొరియోగ్రాఫర్‌ యానీ మాస్టర్‌ 11వ వారం హౌస్‌ నుంచి బయటకి వచ్చేసింది. బిగ్‌బాస్‌ హౌస్‌ లో ఇన్ని రోజులు ఉన్నందుకు యాని మాస్టర్ కి బాగానే లాభం చేకూరిందని సమాచారం.

Anee Master : మీకు బుద్ధి లేదా?? నెటిజన్స్ పై ఫైర్ అయిన యాని మాస్టర్

బిగ్ బాస్ లో పాల్గొనే వాళ్లకి వారానికి ఇంత చొప్పున అని ఎన్ని వారాలు ఉంటే అంత అమౌంట్ ఇస్తారు. హౌస్ లోకి వచ్చే సెలబ్రిటీల పాపులారిటీని బట్టి బిగ్‌బాస్‌ ఒక్కో కంటెస్టెంటుకు ఒక్కో రకంగా రెమ్యునరేషన్‌ ఇస్తుంది. ఒక పక్క స్టార్ హీరోల సినిమాలకు కొరియోగ్రఫీ చేస్తూ, మరో పక్క షోస్ లో హడావిడి చేస్తూ బుల్లి తెరపై అలరిస్తున్న యాని మాస్టర్ కి బిగ్ బాస్ షో నిర్వాహకులు బాగానే రెమ్యునరేషన్ ఇచ్చారని సమాచారం.

Bigg Boss 5 : ఈ వారం నామినేషన్స్‌లో ఉన్నది వీళ్ళే

ఇండస్ట్రీ సమాచారం ప్రకారం యానీకి ఒక్క వారానికి రెండు నుంచి రెండున్నర లక్షల వరకు పారితోషికం ఇచ్చారంట. ఈ లెక్కన 11 వారాలకు గానూ ఆమెకు దాదాపు 25 లక్షల వరకు అందిందని సమాచారం. హౌస్ లో చేరి వచ్చిన డబ్బుతో సొంత ఇల్లు కొనుక్కోవాలి అని యాని మాస్టర్ కల. మరి ఇప్పుడు సొంత ఇల్లు ప్లాన్ చేసుకుంటుందేమో చూడాలి.