NBK108 : రాయలసీమ కాదు తెలంగాణ కథతో NBK108.. అనిల్ రావిపూడి!

నందమూరి బాలకృష్ణ నటించిన తాజా చిత్రం 'వీరసింహారెడ్డి' కలెక్షన్ల సునామి సృష్టిస్తుంది. కాగా నిన్న హైదరాబాద్ జేఆర్‌సీ కన్వేషన్ హాల్ లో వీరసింహుని విజయోత్సవం సెలబ్రేషన్స్ నిర్వహించారు మూవీ మేకర్స్. ఇక ఈ ఈవెంట్ లో అనిల్ రావిపూడి మాట్లాడుతూ..

NBK108 : రాయలసీమ కాదు తెలంగాణ కథతో NBK108.. అనిల్ రావిపూడి!

NBK108

NBK108 : నందమూరి బాలకృష్ణ నటించిన తాజా చిత్రం ‘వీరసింహారెడ్డి’ కలెక్షన్ల సునామి సృష్టిస్తుంది. బాలకృష్ణ నుంచి చాలా కాలం తరువాత ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో సినిమా వస్తుండడంతో బాక్స్ ఆఫీస్ వద్ద బాలయ్య ఊచకోత చూసేందుకు అభిమానులు ఎగపడ్డారు. ఈ మూవీ మాస్ ఆడియన్స్ ని మాత్రమే కాదు, సిస్టర్ సెంటిమెంట్ తో ఫ్యామిలీ ఆడియన్స్ ని కూడా ఆకట్టుకుంది. దీంతో ఈ చిత్రం బాలయ్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచింది. ఇప్పటికే ఈ సినిమా 100 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇవ్వగా, బాలయ్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచిన అఖండ లైఫ్‌టైమ్ కలెక్షన్లను కేవలం ఎనిమిది రోజుల్లోనే క్రాస్ చేసేసింది.

Balakrishna – Vishwak Sen : విశ్వక్ సేన్ డైరెక్షన్‌లో బాలయ్య బాబు?

కాగా నిన్న హైదరాబాద్ జేఆర్‌సీ కన్వేషన్ హాల్ లో వీరసింహుని విజయోత్సవం సెలబ్రేషన్స్ నిర్వహించారు మూవీ మేకర్స్. ఈ కార్యక్రమానికి చిత్ర యూనిట్ తో పాటు టాలీవుడ్ యువ హీరోలు విశ్వక్ సేన్, సిద్దు జొన్నలగడ్డ, హరీష్ శంకర్, అనిల్ రావిపూడి, హను రాఘవపూడి, శివ నిర్వాణ ముఖ్య అథిలుగా హాజయ్యారు. ఇక ఈ ఈవెంట్ లో అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. అఖండ, వీరసింహారెడ్డి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్టులు అందుకున్నారు బాలయ్య బాబు. ప్రస్తుతం వరల్డ్ వైడ్ గా బాలకృష్ణ సీజన్ నడుస్తుంది.

ఆయన ప్రతి సినిమా చేసేటప్పుడు అది అభిమానులకు నచ్చుతుందా? లేదా? అని చాలా ఆలోచిస్తారు. ఆ క్రమంలోనే ప్రతి సినిమాకి ఒక NBK టచ్ ని యాడ్ చేస్తారు. ఆ టచ్ తోనే వీరసింహారెడ్డి వచ్చింది. ఆ తరువాత NBK108 కూడా అదే టచ్ తో ఉండబోతుంది. అయితే ఈసారి అన్న రాయలసీమలో కాదు తెలంగాణలో దిగుతుండు. బాక్స్ ఆఫీస్ ఊచకోత షురూ చేస్తాడు. మీకు కలెక్షన్ల ఖుర్బానీ పెడతాడు అంటూ వ్యాఖ్యానించాడు. కాగా NBK108 అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా ఒక షెడ్యూల్ కూడా పూర్తి చేసుకుంది.