Telugu New Films: కొత్త సినిమాల అనౌన్స్.. దసరా సర్‌ప్రైజ్‌లతో ఉక్కిరిబిక్కిరి!

దసరా పండగ రోజు టాలీవుడ్ హీరోలు ఫ్యాన్స్ ని ఊహించని సర్ ప్రైజ్ లతో ఉక్కిరిబిక్కిరి చేశారు. ఈ దసరా సందడి మొత్తం టాలీవుడ్ లోనే కనిపిస్తోంది. ఎందుకంటే స్టార్ హీరోలు సరికొత్త..

Telugu New Films: కొత్త సినిమాల అనౌన్స్.. దసరా సర్‌ప్రైజ్‌లతో ఉక్కిరిబిక్కిరి!

Telugu New Films

Telugu New Films: దసరా పండగ రోజు టాలీవుడ్ హీరోలు ఫ్యాన్స్ ని ఊహించని సర్ ప్రైజ్ లతో ఉక్కిరిబిక్కిరి చేశారు. ఈ దసరా సందడి మొత్తం టాలీవుడ్ లోనే కనిపిస్తోంది. ఎందుకంటే స్టార్ హీరోలు సరికొత్త సినిమాల్ని అనౌన్స్ చేసి ఫ్యాన్స్ కి పండగ గిఫ్ట్ ఇచ్చారు. శంకర్ సినిమా ఇంకా స్టార్ట్ చెయ్యకుండానే నెక్ట్స్ సినిమా అనౌన్స్ చేసిన చరణ్, బొగ్గు గనుల్లో పనులు చెయ్యడానికి రెడీ అయిన నాని, మరోప్యాన్ ఇండియా సినిమా సైన్ చేసిన రానా.. ఇలా కొత్త సినిమాలు అనౌన్స్ చేసి ఈ సారి ఏ డైరెక్టర్లకి ఛాన్స్ ఇచ్చారో చూద్దాం.

Dussehra Telugu Films: టీజర్లు, పోస్టర్లు, పాటలతో సందడిగా దసరా!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్ లో మరో ఇంట్రస్టింగ్ స్టెప్ తీసుకున్నారు. రంగస్తలం నుంచి డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీస్ చేస్తున్న చరణ్ తన కెరీర్ లో 16వ సినిమాని గౌతమ్ తిన్ననూరితో చేస్తున్నట్టు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. నానితో చేసిన జెర్సీ హిట్ తో ఇటు టాలీవుడ్ ని, అటు బాలీవుడ్ ని ఎట్రాక్ట్ చేసిన గౌతమ్ తిన్ననూరితో సినిమా అనౌన్స్ చేశారు రామ్ చరణ్. యు.వి క్రియేషన్స్ బ్యానర్లో ఈ సినిమా తెరకెక్కబోతోంది. రామ్ చరణ్ తన 15వ సినిమాని స్టార్ డైరెక్టర్ శంకర్ తో అఫీషియల్ గా స్టార్ట్ చేసినా ఇంకా సినిమా మాత్రం సెట్స్ మీదకెళ్లలేదు.

Dussehra Telugu Films: థియేటర్‌లలో మొదలైన బ్యాచిలర్ పెళ్లి సందడి!

నాని కూడా తన 29వ సినిమాని అనౌన్స్ చేశారు. ఇప్పటి వరకూ చేసిన నాని సినిమాల న్నింటిలోకి కంప్లీట్ కాంట్రాస్ట్ మూవీగా సరికొత్తగా కనిపిస్తున్నారు నాని. శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో తెలంగాణ యాసతో పాటు కంప్లీట్ మాస్ లుక్ లో నాని చేస్తున్న ఈ సినిమా దసరా టైటిల్ తో తెరకెక్కబోతోంది. ఈసారి సంక్రాంతి నిరుడు లెక్క ఉండదంటూ టీజింగ్ గా పోస్టర్ రిలీజ్ చేశాడు నాని.

Sankranti 2022 Films: సంక్రాంతి పందెం కోళ్లు.. మనసు మార్చుకుంటారా?

స్టార్ హీరోయిన్ సమంత కూడా తన నెక్ట్స్ ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేశారు. ఖైదీ, ఒకే ఒక జీవితం లాంటి సినిమాలు ప్రొడ్యూస్ చేసిన డ్రీమ్ వారియర్ ప్రొడక్షన్స్ లో శాంతారుబన్ అనే కొత్త డైరెక్టర్ తో సినిమా సైన్ చేశారు సమంత. తమిళ్, తెలుగు బై లింగ్వల్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకెళ్లబోతోంది. వర్సెటైల్ యాక్టర్ రానా కూడా తన కొత్త ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేశారు. మిలింద్ రావ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని గోపీ ఆచంట ప్రొడ్యూస్ చేస్తున్నారు. బ్యాక్ టూ బ్యాక్ ప్యాన్ ఇండియా సినిమాలు చేస్తున్న రానా.. ఈ సినిమాని కూడా ప్యాన్ ఇండియా లెవల్లోనే తెరకెక్కించబోతున్నాడు.