Bhushan Kumar : బాలీవుడ్ హీరోల రెమ్యునరేషన్ గురించి మరో నిర్మాత ఫైర్..

ఒకప్పుడు బాలీవుడ్ సినిమాలు అంటే రూ.100 కోట్లకు చిరునామా. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. కలెక్షన్స్ రాకపోయినా హీరోలు కోట్లలో రెమ్యునరేషన్ అడుగుతున్నారు అంటూ బాలీవుడ్ నిర్మాతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Bhushan Kumar : బాలీవుడ్ హీరోల రెమ్యునరేషన్ గురించి మరో నిర్మాత ఫైర్..

Bhushan Kumar

Bhushan Kumar : ఒకప్పుడు బాలీవుడ్ సినిమాలు అంటే రూ.100 కోట్లకు చిరునామా. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. అమీర్ ఖాన్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ లాంటి వారి సినిమాలే బాక్స్ ఆఫీస్ వద్ద 100 కోట్ల మార్క్ ని అందుకోడానికి నానా తిప్పలు పడుతున్నాయి. సినిమాలో అశ్లీలత, మతాలను కించపరిచేలా సన్నివేశాలు ఉండడంతో బాయ్‌కాట్ ట్రెండ్ కి గురవుతున్నాయి. దీంతో నిర్మాతలు పెట్టిన బడ్జెట్ కూడా వెనక్కి తిరిగి రావడం లేదు. కానీ బాలీవుడ్ హీరోలు మాత్రం పారితోషికం విషయంలో తగ్గేదేలే అంటున్నారు.

Karan Johar : 5 కోట్ల కలెక్షన్స్ కూడా రావు.. 20 కోట్లు రెమ్యునరేషన్స్ కావాలి.. బాలీవుడ్ హీరోలపై కరణ్ జోహార్ సంచలన వ్యాఖ్యలు..

ఇక హీరోల ప్రవర్తనకి విసుగెత్తి పోయిన నిర్మాతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఈ విషయంపై బాలీవుడ్ అగ్ర నిర్మాత కరణ్ జోహార్ వైరల్ కామెంట్స్ చేశాడు. 5 కోట్ల కలెక్షన్స్ కూడా రావు. 20 కోట్లు రెమ్యునరేషన్స్ కావాలి అంటున్నారు అంటూ బాలీవుడ్ హీరోలపై సంచలన వ్యాఖ్యలు చేశాడు కరణ్ జోహార్ . తాజాగా మరో స్టార్ ప్రొడ్యూసర్ టి-సిరీస్ అధినేత భూషణ్ కుమార్ కూడా ఘాటుగా స్పందించాడు.

కొందరు హీరోలు చిన్న సినిమాకి కూడా దాదాపు రూ.20 కోట్ల రెమ్యునరేషన్ అడుగుతుంటారు. చిన్న సినిమాకి అంత బడ్జెట్ పెట్టలేక కొంచెం తగ్గించుకోమని హీరోలను అడుగుతాము. దానిని కొందరు హీరోలు అర్ధం చేసుకుంటారు. కానీ కొంతమంది మాత్రం ఇవ్వాల్సిందే లేదంటే సినిమా చేయము అంటూ చెబుతారు. అప్పుడు మేము కూడా వదిలేస్తాము. ఎందుకంటే తలకు మించిన భారం పెట్టుకుంటే రేపు నష్టబోయేది మేమే. సినిమా బడ్జెట్ లో 20 కోట్ల రెమ్యునరేషన్ కింద హీరోలకే ఇస్తే, రేపు సినిమా సక్సెస్ అవ్వకపోతే మాకే కదా నష్టం. ఈ విషయం ఇప్పటికి అయినా హీరోలు అర్ధం చేసుకొని మారితే మంచిది అంటూ వ్యాఖ్యానించాడు.

ఇక ఇదే ఇంటర్వ్యూలో ఈ నిర్మాత ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా సినిమా గురించి అప్డేట్ ఇచ్చాడు. ‘స్పిరిట్’ అనే టైటిల్ తో రాబోతున్న ఈ సినిమాని భూషణ్ కుమారే నిర్మిస్తున్నాడు. ఈ మూవీ ఈ ఏడాది ఎండింగ్ లో పట్టాలు ఎక్కనున్నట్లు వెల్లడించాడు.