Ravi Teja Son: టాలీవుడ్ లో మరో వారసుడు.. హీరోగా రవితేజ కొడుకు ఎంట్రీ?

టాలీవుడ్ కి మరో వారసుడు ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమవుతున్నాడు. ఇప్పటికే బడా హీరోల నుండి స్టార్ హీరోల వరకు అందరి కుటుంబాల నుండి వారసులు తెరమీదకి వచ్చేయగా..

Ravi Teja Son: టాలీవుడ్ లో మరో వారసుడు.. హీరోగా రవితేజ కొడుకు ఎంట్రీ?

Ravi Teja Son

Ravi Teja Son: టాలీవుడ్ కి మరో వారసుడు ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమవుతున్నాడు. ఇప్పటికే బడా హీరోల నుండి స్టార్ హీరోల వరకు అందరి కుటుంబాల నుండి వారసులు తెరమీదకి వచ్చేయగా.. ఇప్పుడు మాస్ రాజా రవితేజ కుమారుడు కూడా హీరోలగా వెండితెర మీదకి దూసుకొచ్చేస్తున్నాడు. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి స్టార్‌ హీరోగా ఎదిగిన రవితేజకి మహాధన్ అనే కొడుకున్నాడని.. అతను పెరిగి పెద్దవాడయ్యాడని చాలా మందికి తెలియదు.

Raviteja Son: మాస్‌రాజా వారసుడితో హరీష్ శంకర్.. ఏంటీ కథ?

మహాధన్ ఇప్పటికే ‘రాజా ది గ్రేట్‌’ సినిమాలో రవితేజ చిన్నప్పటి రోల్‌లో కనిపించాడు. అప్పటి నుండే మహాధన్ ఎంట్రీపై రకరకాల ప్రచారాలు జరుగుతుండగా.. చదువు పూర్తయ్యాక సినిమాలలోకి వస్తాడని రవితేజ కూడా ఇప్పటికే క్లారిటీ ఇచ్చాడు. కాగా, ఇప్పుడు ఓ యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ తో మహాధన్ డెబ్యూకి సిద్దమవుతున్నట్లు తెలుస్తుంది. మహాధన్‌ కోసం ఇప్పటికే రవితేజను సంప్రదించగా ఆయన కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలుస్తుంది.

Ravi Teja: కరోనా వేవ్‌ను సక్సెస్ వేవ్‌గా మార్చుకున్న మాస్ రాజా!

రాజా ది గ్రేట్‌ సినిమాతో రవితేజకు హిట్‌ ఇచ్చిన అనిల్‌ రావిపూడే ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నట్లు తెలుస్తుంది. దీనిపై అఫీషియల్‌ అనౌన్స్‌మెంట్‌ రావాల్సి ఉంది. మరో వైపు దర్శకుడు హరీష్ శంకర్ కూడా మహాధన్ డెబ్యూకి ప్రయత్నాలు చేస్తున్నాడట. ఇందుకోసం ఇప్పటికే రవితేజతో కథా చర్చలు కూడా జరిపిన హరీష్ తో అయినా మహాధన్ లాంచింగ్ ఉండే అవకాశం లేకపోలేదని తెలుస్తుంది.