Acharya: ఆచార్యలో మరో బ్యూటీ.. ఎవరంటే?

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఆచార్య’ ఈనెల 29న రిలీజ్ కు రెడీ అయ్యింది. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు...

Acharya: ఆచార్యలో మరో బ్యూటీ.. ఎవరంటే?

Anushka Shetty In Acharya News Goes Viral

Acharya: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఆచార్య’ ఈనెల 29న రిలీజ్ కు రెడీ అయ్యింది. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాలో చిరు లుక్ సరికొత్తగా ఉండనుండటంతో ఆచార్య మూవీ ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాలో మెగాస్టార్ తో పాటు మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తుండటంతో ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులు కూడా ఎంతో ఆతృతగా చూస్తున్నారు.

Acharya: ఆచార్య ప్రీరిలీజ్ బిజినెస్ రిపోర్ట్.. టార్గెట్ ఎంతంటే?

అయితే ఈ సినిమాలో చిరంజీవి సరసన హీరోయిన్‌గా కాజల్ అగర్వాల్ నటిస్తుందని చిత్ర యూనిట్ గతంలోనే వెల్లడించింది. కానీ ఆమె ప్రెగ్నెంట్ కావడంతో ఆమె ఈ సినిమాను పూర్తి చేయలేకపోయింది. దీంతో ఆమె పాత్రను ఈ సినిమా నుండి డిలీట్ చేసినట్లు చిత్ర దర్శకుడు కొరటాల చెప్పుకొచ్చాడు. చిరంజీవి పాత్రకు ఈ సినిమాలో రొమాంటిక్ సీన్స్ లాంటివి ఏమీ ఉండవని చిత్ర యూనిట్ తెలిపింది. అయితే ఈ విషయంతో చిరంజీవి అభిమానులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. చిరంజీవి సినిమా అంటేనే రొమాన్స్, డ్యాన్స్, డ్యూయెట్ సాంగ్స్ ఖచ్చితంగా ఉండాలి. హీరోయిన్లను అల్లరిపట్టించే చిరంజీవిని చూసి చాలా రోజులయ్యిందని, వారు ఆచార్య సినిమాలో అలాంటి పాత్ర ఉంటుందని ఊహించారు.

Acharya: బ్యాడ్ న్యూస్.. అక్కడ ఆచార్య ఎంట్రీ లేనట్టే..?

కానీ ఇప్పుడు ఆచార్య సినిమాలో చిరుకు జోడీగా ఎవరూ లేరని వారు నిరాశ చెందుతున్నారు. అయితే సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాలో ప్రేక్షకులకు ఓ సర్‌ప్రైజ్ ఖచ్చితంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా క్లైమాక్స్ చివర్లో చిరంజీవి సరసన ఓ స్టార్ హీరోయిన్ నటిస్తుందని.. ఆమెతో ఓ సాంగ్ కూడా ఉండబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే నిజమైతే మెగా ఫ్యాన్స్‌కు అదిరిపోయే ట్రీట్ ఖాయమని వారు అంటున్నారు. ఇక ఆ స్టార్ హీరోయిన్ మరెవరో కాదని.. అనుష్క శెట్టి అని తెలుస్తోంది. ఇప్పటికే ఆమె ఈ సినిమా షూటింగ్‌లో కూడా పాల్గొన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉందనే విషయంపై చిత్ర యూనిట్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.