Adipurush: ఆదిపురుష్ సినిమాపై అయోధ్య రామాలయం ప్రధాన అర్చకుడు ఆగ్రహం.. సినిమాని బ్యాన్ చేయాలంటూ డిమాండ్

ఇప్పుడు ఏకంగా బాయ్‌కాట్ ఆదిపురుష్, బ్యాన్ ఆదిపురుష్ అని ట్విట్టర్లో ట్రెండ్ చేస్తున్నారు. ఇప్పటికే బాలీవుడ్ మీద తీవ్ర వ్యతిరేకత ఉంది. బాయ్‌కాట్ బాలీవుడ్ అంటూ గత కొన్ని రోజులుగా బాలీవుడ్ పై వ్యతిరేకత వస్తున్న సంగతి తెలిసిందే. దీనికి ఎన్ని కారణాలు ఉన్నా ముఖ్య కారణం బాలీవుడ్ సినిమాల్లో హిందూ దేవుళ్ళని, పురాణాల్ని, హిందూ చరిత్రని వక్రీకరించడం

Adipurush: ఆదిపురుష్ సినిమాపై అయోధ్య రామాలయం ప్రధాన అర్చకుడు ఆగ్రహం.. సినిమాని బ్యాన్ చేయాలంటూ డిమాండ్

Ayodhya Ram Temple Head Priest Demands Ban On Adipurush Film

Adipurush: ఆదిపురుష్ సినిమాపై కొనసాగుతున్న వివాదం మరింత తీవ్రమైంది. ఈ సినిమా టీజర్‭లో రావణుడిని చాలా అభ్యంతరకరంగా చూపించారంటూ రైట్ వింగ్ గ్రూపులకు చెందిన కొంత మంది ఆగ్రహం వ్యక్తం చేస్తూ సినిమా బాయ్‭కాట్‭కు పిలుపునిస్తుండగా తాజాగా ఈ జాబితాలో అయోధ్య రామాలయ ప్రధాన అర్చకుడు సరేంద్ర దాస్ కూడా చేరారు. ఆయన సైతం టీజర్‭పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రావణుడిని చూపించిన తీరు తప్పని, ఖండించదగినదని అన్నారు. అయోధ్యలో ఏటా నిర్వహించే రథయాత్ర సందర్భంగా బుధవారం ఆయన ఈ డిమాండ్ చేశారు.

‘‘శ్రీరాముడిని, హనుమంతుడిని ఇతిహాస రామాయణంలో వర్ణించినట్లుగా ఈ బాలీవుడ్ సినిమాలో చూపించడం లేదు. వారి గౌరవమర్యాదలకు విరుద్ధంగా చూపిస్తున్నారు. రావణుడిని చూపించిన తీరైతే మరీ అభ్యంతరకరంగా ఉంది. దీన్ని అందరూ ఖండించాలి. వారు చూపించిన విధానం పూర్తి తప్పు. ఆదిపురుష్ సినిమాను నిషేదించాలి’’ అని సరేంద్ర దాస్ డిమాండ్ చేశారు.

బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా, సైఫ్ అలీఖాన్ రావణాసురుడుగా నటించారు. అయితే టీజర్ రిలీజైన దగ్గరనించి టీజర్ పై, సినిమాపై, డైరెక్టర్ పై విమర్శలు, ట్రోల్స్ వస్తున్నాయి.

ఒకవైపు ప్రభాస్ అభిమానులు రామాయణం అని చెప్పి బొమ్మల సినిమా, గ్రాఫిక్స్ సినిమా తీశారేంటి అని తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. మరోవైపు ఏమో అసలు అందులో రామాయణం ఎక్కడుంది. రావణాసురుడు ఎలా ఉంటాడో తెలీదా, హనుమంతుడు ఎలా ఉంటాడో తెలీదా అంటూ హిందూ సంఘాలు, హిందువులు, బీజేపీ నాయకులు మండిపడుతున్నారు. రామాయణం అని చెప్పి ఏదో హాలీవుడ్ గ్రాఫిక్స్ సినిమా చూపిస్తున్నారని, అందులో రామాయణం ఆనవాళ్లు ఒక్కటి కూడా లేవని దర్శకుడు ఓం రౌత్ ని విమర్శిస్తున్నారు.

ఇప్పుడు ఏకంగా బాయ్‌కాట్ ఆదిపురుష్, బ్యాన్ ఆదిపురుష్ అని ట్విట్టర్లో ట్రెండ్ చేస్తున్నారు. ఇప్పటికే బాలీవుడ్ మీద తీవ్ర వ్యతిరేకత ఉంది. బాయ్‌కాట్ బాలీవుడ్ అంటూ గత కొన్ని రోజులుగా బాలీవుడ్ పై వ్యతిరేకత వస్తున్న సంగతి తెలిసిందే. దీనికి ఎన్ని కారణాలు ఉన్నా ముఖ్య కారణం బాలీవుడ్ సినిమాల్లో హిందూ దేవుళ్ళని, పురాణాల్ని, హిందూ చరిత్రని వక్రీకరించడం. ప్రతి సారి దేవుళ్లకి సంబంధించిన సినిమాలు బాలీవుడ్ లో వస్తే ఇదే జరుగుతుంది. ఇప్పుడు ఆదిపురుష్ విషయంలో కూడా ఇదే జరుగుతుంది.

Adipurush: ఆదిపురుష్ పోస్టర్ తమ పోస్టర్ నుంచి కాపీ చేశారంటూ.. ప్రముఖ యానిమేషన్ స్టూడియో ప్రకటన!