Badri Re-Release: మరోసారి పవర్ చూపించేందుకు రెడీ అవుతున్న పవన్ కల్యాణ్..!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను ఇటీవల వరుసగా రీ-రిలీజ్ చేస్తూ బాక్సాఫీస్ వద్ద ట్రెండ్ సెట్ చేస్తున్నారు మేకర్స్. ఇక రీసెంట్‌గా పవన్ ‘ఖుషి’ రీ-రిలీజ్ అయ్యి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్ అందుకుంది. ఈ సినిమా రీ-రిలీజ్‌కి కూడా అభిమానులు క్యూ కట్టారు. పవన్ తనదైన మేనరిజంతో అభిమానులకు మరోసారి ఈ సినిమాలతో కిక్కిస్తున్నాడు.

Badri Re-Release: మరోసారి పవర్ చూపించేందుకు రెడీ అవుతున్న పవన్ కల్యాణ్..!

Pawan Kalyan Badri Re-Release Locks Date

Badri Re-Release: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను ఇటీవల వరుసగా రీ-రిలీజ్ చేస్తూ బాక్సాఫీస్ వద్ద ట్రెండ్ సెట్ చేస్తున్నారు మేకర్స్. ఇక రీసెంట్‌గా పవన్ ‘ఖుషి’ రీ-రిలీజ్ అయ్యి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్ అందుకుంది. ఈ సినిమా రీ-రిలీజ్‌కి కూడా అభిమానులు క్యూ కట్టారు. పవన్ తనదైన మేనరిజంతో అభిమానులకు మరోసారి ఈ సినిమాలతో కిక్కిస్తున్నాడు.

Pawan Kalyan: బాలయ్య కోసం వస్తున్న పవన్.. టాక్ షోకు కాదండోయ్!

అయితే ఇప్పుడు పవన్ నటించిన మరో బ్లాక్‌బస్టర్ మూవీ కూడా రీ-రిలీజ్‌కు రెడీ అయ్యింది. దర్శకుడు పూరీ జగన్నాధ్ డైరెక్షన్‌లో వచ్చిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘బద్రి’ మూవీ అప్పట్లో యూత్‌ను ఏ విధంగా ఆకట్టుకుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆ సమయంలో లవ్‌స్టోరీ మూవీల్లో బద్రి ఓ ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. ఈ సినిమాలో పవన్ పర్ఫార్మెన్స్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.

Pawan Kalyan: న్యూ ఇయర్ గిఫ్ట్‌తో ‘ఖుషి’ చేయనున్న పవన్

ఇక ఈ సినిమాతో పవన్ తన కెరీర్‌లో మరో సూపర్ హిట్ అందుకున్నాడు. అయితే ఇప్పుడు ఈ సినిమాను థియేటర్లలో రీ-రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీని రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న భారీ ఎత్తున రీ-రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ఈ సినిమాలో రేణు దేశాయ్, అమీషా పటేల్ హీరోయిన్లుగా నటించగా, రమణ గోగుల ఈ చిత్రానికి సూపర్బ్ మ్యూజిక్‌ను అందించాడు. మరి బద్రి రీ-రిలీజ్‌కు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయం దక్కుతుందో చూడాలి.