NBK108: మాసివ్ యాక్షన్‌లో గాడ్ ఆఫ్ మాసెస్.. బాలయ్య వీరంగం మామూలుగా ఉండదట!

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న NBK108 మూవీలో ప్రస్తుతం ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను షూట్ చేస్తున్నట్లు చిత్ర వర్గాలు చెబుతున్నాయి.

NBK108: మాసివ్ యాక్షన్‌లో గాడ్ ఆఫ్ మాసెస్.. బాలయ్య వీరంగం మామూలుగా ఉండదట!

Balakrishna In Massive Action For NBK108

NBK108: నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రాన్ని NBK108 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కిస్తున్నారు చిత్ర యూనిట్. ఈ సినిమాను దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తుండటంతో ఈ మూవీపై అంచనాలు ఓ రేంజ్‌లో సెట్ అయ్యాయి. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్స్‌కు ప్రేక్షకుల నుండి ట్రెమెండస్ రెస్పాన్స్ లభించింది. దీంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు పూర్తి చేస్తారా.. ఈ చిత్రాన్ని ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

NBK108 : యాక్షన్ సీక్వెన్స్‌లో బాలయ్య.. NBK108 నుంచి వీడియో లీక్!

ఈ సినిమాలో బాలయ్య సరికొత్త లుక్‌లో కనిపిస్తుండటంతో అభిమానులు థ్రిల్ అవుతున్నారు. ఇక ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ చిత్ర షూటింగ్‌లో ఓ మాసివ్ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ యాక్షన్ సీక్వెన్స్‌ను వెంకట్‌ మాస్టర్‌ కొరియోగ్రాఫ్ చేస్తున్నాడట. ఇందులో బాలయ్య చేసే యాక్షన్ మునుపెన్నడూ చూడని విధంగా ఉండబోతుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఇక ఈ సినిమాలో బాలయ్య పూర్తి తెలంగాణ యాసతో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే వెల్లడించింది.

NBK108: వినాయకుడి పూజలు చేస్తున్న బాలయ్య.. ఏకంగా 5 కోట్ల ఖర్చు!

NBK108 మూవీలో బాలయ్య సరసన అందాల భామ కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోండగా, యంగ్ బ్యూటీ శ్రీలీల ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తోంది. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా, దసరా కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.