Veera Simha Reddy : ఒక డైలాగ్ నుంచి వీరసింహారెడ్డి కథ పుట్టింది.. ఆ డైలాగ్ ఏంటో తెలుసా?

నందమూరి నటసింహ బాలకృష్ణ హీరోగా నటించిన రీసెంట్ బ్లాక్ బస్టర్ మూవీ 'వీరసింహారెడ్డి'. సినిమా బ్లాక్ బస్టర్ హిట్టు అవ్వడంతో చిత్ర యూనిట్ నిన్న వీరసింహుని విజయోత్సవం సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాలకృష్ణ మాట్లాడుతూ వీరసింహారెడ్డి కథ ఎలా పుట్టిందో చెప్పుకొచ్చాడు.

Veera Simha Reddy : ఒక డైలాగ్ నుంచి వీరసింహారెడ్డి కథ పుట్టింది.. ఆ డైలాగ్ ఏంటో తెలుసా?

Veera Simha Reddy

Veera Simha Reddy : నందమూరి నటసింహ బాలకృష్ణ హీరోగా నటించిన రీసెంట్ బ్లాక్ బస్టర్ మూవీ ‘వీరసింహారెడ్డి’. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మొదటి షో నుంచే సూపర్ హిట్టు టాక్ ని సొంతం చేసుకొని బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామి సృష్టించింది. కేవలం నాలుగు రోజులోనే దాదాపు రూ.104 కోట్లు రాబట్టి కలెక్షన్ల ఊచకోత కోశాడు వీరసింహారెడ్డి. యూఎస్‌ఏ బాక్స్ ఆఫీస్ వద్ద కూడా 1 మిలియన్ గ్రాస్ కలెక్షన్స్ సాధించి సంచలనం సృష్టించింది. దీంతో చిత్ర యూనిట్ నిన్న వీరసింహుని విజయోత్సవం సెలబ్రేషన్స్ నిర్వహించారు.

Veera Simha Reddy: అఖండ రికార్డులను 8 రోజుల్లోనే బద్దలుకొట్టిన వీరసింహారెడ్డి

హైదరాబాద్ జేఆర్‌సీ కన్వేషన్ హాల్ లో జరిగిన ఈ ఈవెంట్ కి చిత్ర యూనిట్ తో పాటు టాలీవుడ్ యువ హీరోలు విశ్వక్ సేన్, సిద్దు జొన్నలగడ్డ, హరీష్ శంకర్, అనిల్ రావిపూడి, హను రాఘవపూడి, శివ నిర్వాణ ముఖ్య అథిలుగా హాజయ్యారు. ఇక ఈ కార్యక్రమంలో బాలకృష్ణ మాట్లాడుతూ వీరసింహారెడ్డి కథ ఎలా పుట్టిందో చెప్పుకొచ్చాడు. ఒకొక సారి ఒక డైలాగ్ నుంచి, ఒక మ్యానరిజం నుంచి సినిమా కథలు పుట్టుకొస్తుంటాయి. దానికి ఆద్యుడు మా దర్శకుడు బోయపాటి శ్రీను. మలినేని గోపీచంద్ నా దగ్గరికి వచ్చినప్పుడు ఏ సినిమా చేద్దాం అనే ఆలోచనలో పడ్డాం. ఆ సమయంలో నేను ఒక డైలాగ్ చెప్పను. దాని నుంచే ఈ వీరసింహారెడ్డి కథ పుట్టుకొచ్చింది.

సీమ రక్తం కుతకుత లాడుతోంది అని అన్నాను. అది విన్న గోపి వెంటనే చెన్నకేశవరెడ్డి అని అన్నాడు. ఆ నేపథ్యంలోనే ఒక అద్భుతమైన సీమ కథని సిద్ధం చేసుకొని వచ్చాడు. ఈ సినిమా ఒక కథ కాదు, ఇదొక ప్రయాణం. ఈ చిత్రం ఎంతటి సక్సెస్ అయ్యింది అంటే తెలుగు వారితో పాటు ఇతర బాషల వారు కూడా ఈ సినిమాని మెచ్చుకుంటున్నారు. రిలీజ్ కి ముందే ఈ సినిమా ఒక విస్ఫోటనం అని చెప్పా. చెప్పినట్లే నేడు అఖండమైన విజయాన్ని అందుకుందని తెలియజేశాడు. ఇక ఈ చిత్రానికి రామజోగయ్యశాస్త్రి, సాయి మాధవ్ బుర్ర అద్బుతమైన పాటలు, మాటలు అందించారని, సంగీత దర్శకుడు థమన్ తన బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టు సంగీతం అందించాడని వెల్లడించాడు.