Balakrishna: అన్‌స్టాపబుల్ మూవీ లైనప్.. జోరు మీదున్న బాలయ్య!

అఖండ బూస్టప్ తో అన్ స్టాపబుల్ గా దూసుకుపోతున్నారు బాలకృష్ణ. ఇప్పటికే నలుగురు క్రేజీ డైరెక్టర్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నందమూరి నటసింహం.. మరో యంగ్ డైరెక్టర్ స్టోరీని కూడా..

Balakrishna: అన్‌స్టాపబుల్ మూవీ లైనప్.. జోరు మీదున్న బాలయ్య!

Nbk

Balakrishna: అఖండ బూస్టప్ తో అన్ స్టాపబుల్ గా దూసుకుపోతున్నారు బాలకృష్ణ. ఇప్పటికే నలుగురు క్రేజీ డైరెక్టర్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నందమూరి నటసింహం.. మరో యంగ్ డైరెక్టర్ స్టోరీని కూడా యాక్సెప్ట్ చేశారు. రీసెంట్ గా గోపీచంద్ మలినేనితో షూటింగ్ కూడా మొదలు పెట్టిన బాలయ్య.. ఇక నాన్ స్టాప్ దండయాత్రకు సిద్ధమవుతున్నారు.

NBK107: బాబు రెడీ.. యాక్షన్ మొదలుపెట్టిన బాలయ్య!

బాలయ్య 107వ సినిమా షురూ అయింది. గోపీచంద్ మలినేని, మైత్రీ మూవీ మేకర్స్ కాంబోలో కొత్త సినిమా షూటింగ్ ను సిరిసిల్లలో ప్రారంభించారు. క్రాక్ తో మాస్ హిట్ అందుకున్న గోపీచంద్ మలినేనితో అఖండ బ్లాక్ బస్టర్ తర్వాత బాలకృష్ణ వర్క్ చేస్తుండటంతో ఫ్యాన్స్ లో క్రేజీ బజ్ క్రియేట్ అయ్యింది. మాస్ ఆడియన్స్ లో ఎక్స్పెక్టేషన్స్ ఓ రేంజ్ లో పెరిగాయి. శృతీహాసన్ హీరోయిన్ కాగా, వరలక్ష్మీ శరత్ కుమార్, దునియా విజయ్ వంటి పాపులర్ స్టార్స్ కీరోల్స్ ప్లే చేస్తున్నారిందులో.

Unstoppable With NBK: బాలయ్యతో మెగాస్టార్ ఎపిసోడ్.. ఎందుకు వర్క్‌ఔట్ కాలేదంటే?

గోపీచంద్ మలినేని ప్రాజెక్ట్ కంప్లీట్ కాగానే అనిల్ రావిపూడితో సెట్స్ పైకెళ్తారు బాలయ్య. గతంలోనే అనిల్ రావిపూడికి కమిట్మెంట్ ఇచ్చిన బాలకృష్ణ ఆ సినిమాకు ముహూర్తం పెట్టుకోవాల్సి ఉంది. బాలయ్య-అనిల్ రావిపూడి కాంబోను దిల్ రాజు నిర్మిస్తారనే వార్తలిప్పుడు ఇండస్ట్రీలో ట్రెండ్ అవుతున్నాయి. అనిల్ రావిపూడి తర్వాత బోయపాటి శ్రీనుతో నటసింహం అఖండ2 చేసే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం రామ్ పోతినేనితో సినిమా ప్లాన్ చేస్తున్న బోయపాటి నెక్ట్స్ బాలయ్యనే డైరెక్ట్ చేసేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు.

Unstoppable with NBK: ఫినాలే ఎపిసోడ్.. కళ్లు చెమ్మగిల్లేట్టు బాలయ్య వ్యాఖ్యలు!

గోపీచంద్ మలినేని, అనిల్ రావిపూడి, బోయపాటిల తర్వాత క్రేజీ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తో సినిమా చేయనున్నారు బాలకృష్ణ. పైసావసూల్ తర్వాత వీరిద్దరూ కలుస్తురాంటే ఫ్యాన్స్ లో ఫుల్ జోష్ కనిపిస్తుంది. ప్రస్తుతం లైగర్ పనుల్లో బిజీగా ఉన్న పూరీ.. ఆపై మళ్లీ విజయ్ దేవరకొండతోనే జనగణమన సినిమాను లైన్ లో పెట్టాడు. అదయ్యాకే బాలకృష్ణ సినిమా చేయబోతున్నట్టు సమాచారం. ఇలా క్రేజీ డైరెక్టర్లతో లైనప్ క్రియేట్ చేసుకున్న బాలయ్య.. మరో యంగ్ డైరెక్టర్ సంపత్ నంది స్టోరీని కూడా యాక్సెప్ట్ చేసారని తెలుస్తుంది. అఖండ మ్యాసివ్ హిట్ ఇచ్చి నెంబర్ వన్ షోగా ఆహా అన్ స్టాపబుల్ ను నిలిపిన బాలయ్య.. ఇలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ స్పీడ్ పెంచారు.