NBK108 : NBK108 షూటింగ్‌కి ముహూర్తం ఫిక్స్ చేసిన బాలయ్య..

నందమూరి బాలకృష్ణ నటించిన రీసెంట్ మూవీ వీరసింహారెడ్డి బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. కాగా ఇప్పటికే తన తదుపరి సినిమా NBK108ని కూడా మొదలు పెట్టేసిన బాలయ్య.. ఆల్రెడీ ఒక షెడ్యూల్ కూడా పూర్తి చేశాడు. తాజాగా..

NBK108 : NBK108 షూటింగ్‌కి ముహూర్తం ఫిక్స్ చేసిన బాలయ్య..

NBK108

NBK108 : నందమూరి బాలకృష్ణ నటించిన రీసెంట్ మూవీ వీరసింహారెడ్డి బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. మలినేని గోపీచంద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బాలకృష్ణ వింటేజ్ లుక్స్ కనిపించి అదరగొట్టేశాడు. తాజాగా ఈ చిత్రం 50 రోజులు వేడుక కూడా పూర్తి చేసుకుంది. దాదాపు 130 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి బాలయ్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ గ్రాసర్ ల్లో ఒకటిగా నిలిచింది. కాగా ఇప్పటికే తన తదుపరి సినిమా NBK108ని కూడా మొదలు పెట్టేసిన బాలయ్య.. ఆల్రెడీ ఒక షెడ్యూల్ కూడా పూర్తి చేశాడు.

Balakrishna : మరో యాడ్‌తో బాలయ్య.. ధగధగ మెరిసిపోతున్నాడుగా..

అయితే ఇటీవల కాలంలో నందమూరి తారకరత్న హాస్పిటల్ లో జాయిన్ అవ్వడం, ఆ తరువాత చనిపోవడంతో.. బాలయ్యే అంతా దగ్గర ఉండి చూసుకోవాల్సి వచ్చింది. దీంతో NBK108 సెకండ్ షెడ్యూల్ లేటు అవుతూ వచ్చింది. ఇక ఈరోజు (మార్చి 2) తారకరత్న పెద్దకర్మ కార్యక్రమం జరగడంతో, బాలయ్య మళ్ళీ బ్యాక్ టు షూట్ అంటున్నాడు. NBK108 సెకండ్ షెడ్యూల్ మార్చి 4 ప్రారంభం కానుంది అని తెలుస్తుంది. చిన్న చిన్న గ్యాప్ లు మినహా కంటిన్యూ షూట్ జరుగుతుందట. ఈ సినిమాలో బాలయ్యకి జోడిగా కాజల్ అగర్వాల్ నటిస్తుంది.

ఈ నెలలోనే కాజల్ కూడా షూట్ లో జాయిన్ అవుతుందని సమాచారం. అయితే ఈ వార్త పై అధికారిక ప్రకటన ఏమి రాలేదు. కాగా ఈ చిత్రాన్ని అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తున్నాడు. తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా ఉండబోతున్నట్లు ఇప్పటికే దర్శకుడు తెలియజేశాడు. ఎస్ ఎస్ థమన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. ఇక అఖండ, వీరసింహారెడ్డి సినిమాలతో వరుస బ్యాక్ టు బ్యాక్ విజయాలు అందుకున్న బాలకృష్ణ.. ఈ సినిమాతో కూడా హిట్టు కొట్టి హ్యాట్రిక్ సాధించాలని చూస్తున్నాడు. మరి దర్శకుడు అనిల్ రావిపూడి బాలయ్యకి హ్యాట్రిక్ ఇస్తాడా? లేదా? చూడాలి.