Bandla Ganesh : నేపాలీ పాపను దత్తత తీసుకున్న బండ్ల గణేష్

తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఓ నేపాలీ పాపని పెంచుకుంటున్నట్టు తెలిపాడు బండ్ల గణేష్. ఓ రోజు నేను మా ఆవిడ ఒక చోటికి వెళ్తే అక్కడ పాప ఏడుస్తూ ఉంది. మా ఆవిడ ......

Bandla Ganesh : నేపాలీ పాపను దత్తత తీసుకున్న బండ్ల గణేష్

Bandla

Bandla Ganesh :  టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో ఏళ్లుగా కమెడియన్‌గా, నిర్మాతగా అలరిస్తున్నారు. పవన్ కళ్యాణ్ సాయంతో స్టార్ ప్రొడ్యూసర్ గా ఎదిగారు. సమాజంలోని అంశాల గురించి ఎప్పటికప్పుడు నిర్మొహమాటంగా మాట్లాడతారు. ఇక సినిమా ఫంక్షన్స్ లో ఆయన ఇచ్చే స్పీచ్ లకు సపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు. ఇదంతా ఒకవైపు ఐతే మరో వైపు ఎంతో మందికి సాయం చేస్తారు. ఆయన సొంత ఊళ్ళో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. కరోనా టైంలో కూడా చాలా మందికి సహాయం చేసారు బండ్ల గణేష్. అప్పుడప్పుడు సోష‌ల్ మీడియాలో సాయం అడిగిన కొంద‌రికి త‌న వంతు సాయం అందించాడు.

Bigg Boss 5 : నేను ఇంకో అమ్మాయికి ప్రపోజ్ చేశాను.. సిరికి షాకిచ్చిన శ్రీహాన్

తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఓ నేపాలీ పాపని పెంచుకుంటున్నట్టు తెలిపాడు బండ్ల గణేష్. ఓ రోజు నేను మా ఆవిడ ఒక చోటికి వెళ్తే అక్కడ పాప ఏడుస్తూ ఉంది. మా ఆవిడ వెళ్లి పాప వాళ్ల అమ్మని ఎందుకు ఏడుస్తుంది? ఏమన్నా తినడానికి పెట్టు అంటే నా దగ్గర ఏమీ లేక కేవలం పాలు మాత్రమే పట్టాను అని చెప్పింది. నా భార్య అది చూసి.. మనం ఈ పాపని పెంచుకుందామని చెప్పింది. నేను కూడా సరే అని చెప్పి పాపని పెంచుకుంటున్నాము అని అన్నారు గణేష్.

Akhanda : బాలకృష్ణలాగా డైలాగ్స్ చెప్పేవాళ్ళు ఇండస్ట్రీలో ఎవరూ లేరు: అల్లు అర్జున్

అందరూ కుక్కలు, పిల్లులు పెంచుకుంటారు. వాటి కోసం ఎంతో ఖర్చు పెడుతుంటారు. కానీ నేను ఇలా పాపని పెంచుకొని, ఆ పాప బాధ్యత తీసుకొని గొప్పగా చదివించాలని అనుకుంటున్నాన‌ని బండ్ల తెలిపారు. ఇప్పుడు ఈ పాప మా ఇంట్లో ఓ మెంబర్ అయిపోయింది అని అన్నాడు. అప్పుడప్పుడు ఈ పాపే మా అందరినీ బెదిస్తుందని సరదాగా నవ్వుతూ అన్నారు. మరోసారి బండ్ల గణేష్ మంచి మనుసుని తెలుసుకున్న అభిమానులు పొగిడేస్తున్నారు.

Bigg Boss 5 : సచ్చినోడా అంటూ షణ్నుని స్టేజిపైనే తిట్టేసిన దీప్తి..

ప్రస్తుతం బండ్ల గణేష్ హీరోగా ‘డేగల బాబ్జీ’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఓ తమిళ్ సినిమాకి రీమేక్ ఇది. క్రైమ్‌, సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా ఈ సినిమా త్వరలోనే రాబోతుంది. ఇటీవలే ఈ మూవీ ట్రైల‌ర్ విడుద‌ల అయింది. ఇందులో బండ్ల గణేష్ యాక్టింగ్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. సినిమా కోసం ఎదురు చూస్తున్నారు ప్రేక్షకులు.