Bheemla Nayak: ఓటీటీలో వచ్చేస్తుంది.. ఇక హిందీ రిలీజ్ లేనట్లేనా?

పవర్ స్టామ్ తో ఫాన్స్ కి ఫీస్ట్ ఇచ్చిన పవర్ స్టార్.. ఇప్పుడు ఓటీటీ ఎంట్రీకి రెడీ అవుతున్నారు. మరో రెండు రోజుల్లో ఓటీటీకొస్తున్న..

Bheemla Nayak: ఓటీటీలో వచ్చేస్తుంది.. ఇక హిందీ రిలీజ్ లేనట్లేనా?

Bheemla Nayak (1)

Bheemla Nayak: పవర్ స్టామ్ తో ఫాన్స్ కి ఫీస్ట్ ఇచ్చిన పవర్ స్టార్.. ఇప్పుడు ఓటీటీ ఎంట్రీకి రెడీ అవుతున్నారు. మరో రెండు రోజుల్లో ఓటీటీకొస్తున్న భీమ్లానాయక్ బాలీవుడ్ లో రిలీజ్ అయ్యేదెప్పుడు? కమింగ్ సూన్ అంటూ ఆల్రెడీ హిందీ ట్రైలర్ కూడా రిలీజ్ చేసిన టీమ్.. భీమ్లాని బాలీవుడ్ లో రిలీజ్ చేసేదెప్పుడు అనే చర్చ జరుగుతుంది.

Bheemla Nayak: గుడ్ న్యూస్.. ఒకరోజు ముందే ‘ఆహా’లో భీమ్లా నాయక్!

పవన్ కళ్యాణ్, రానా లీడ్ రోల్స్ లో సితార ప్రొడక్షన్స్ లో సాగర్ చంద్రడైరెక్షన్లో రిలీజ్ అయిన భీమ్లానాయక్.. ధియేటర్లు దద్దరిల్లే సక్సెస్ సాధించింది. 100కోట్ల కలెక్షన్ ని ఈజీగా క్రాస్ చేసిన భీమ్లా నాయక్ క్రేజ్ చూసి ఫుల్ ఖుష్ అయిపోయారు మేకర్స్. తెలుగులో భీమ్లానాయక్ తెచ్చిన బ్లాక్ బస్టర్ సక్సెస్ చూసి ఈ సూపర్ హిట్ మూవీని హిందీలో రిలీజ్ చేస్తున్నట్టు అప్పుడే అనౌన్స్ చేసింది సితార ఎంటర్ టైన్ మెంట్స్.

Bheemla Nayak Bike: ‘ఆహా’ బంపర్ ఆఫర్.. పవన్ బైక్ సొంతం చేసుకొనే ఛాన్స్!

పవన్ కళ్యాణ్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని ప్రూవ్ చేసిన భీమ్లానాయక్ ని బాలీవుడ్ లో కూడా రిలీజ్ చెయ్యాలని ప్లాన్ చేసింది సితార ఎంటర్ టైన్ మెంట్స్. కాప్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈగో క్లాషెస్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన భీమ్లానాయక్ యూనివర్సల్ స్టోరీ కావడంతో.. బాలీవుడ్ కి కూడా బాగానే కనెక్ట్ అవుతుందని భీమ్లా కమింగ్ సూన్ అంటూ హిందీలో ట్రైలర్ కూడా రిలీజ్ చేసింది టీమ్.

Bheemla Nayak: RRR రిలీజ్ రోజున పవన్ డబుల్ ధమాకా!

భీమ్లానాయక్ ధియేటర్ నుంచి ఓటీటీకి కూడా వచ్చేస్తోంది. పవర్ స్టామ్ కమింగ్ అంటూ ఆహా, అటు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ప్రమోషన్లతో ఊదరగొట్టేస్తున్నాయి. ఇంత బ్లాక్ బస్టర్ మూవీ మార్చి 25న రెండు ఓటీటీ యాప్స్ లో రిలీజ్ అవుతోంది. మరో రెండు రోజుల్లో ఓటీటీలోకే వచ్చేస్తున్న ఈ సినిమాని డబ్ చేసి బాలీవుడ్ లో రిలీజ్ చెయ్యడానికి టైమెక్కడుందన్న ధర్మ సందేహంతో ఉన్నారు ఫాన్స్.

Bheemla Nayak: ఓటీటీలో భీమ్లా.. రికార్డులు ఆహా అనాల్సిందే!

రెండురోజుల్లో ఓటీటీలోకి వచ్చేస్తున్న సినిమాని డబ్బింగ్ చేసే దెప్పుడు..? ధియేటర్లో రిలీజ్ చేసేదెప్పుడు..? ఇంత హడావిడిగా రిలీజ్ అయితే చెయ్యడానికి ఛాన్సే లేదు.. ఒక్క సారి ఓటీటీలకొచ్చాక.. ఇక హిందీలో డబ్ చేసి రిలీజ్ చేసినా పెద్దగా ఉపయోగం లేదు. హిందీ డబ్బింగ్ రిలీజ్ గురించి అటు సినిమాటీమ్ కూడా ఏం క్లారిటీ ఇవ్వకపోవడంతో.. భీమ్లా నాయక్ బాలీవుడ్ ఎంట్రీకి బ్రేక్ పడ్డట్టే.. హిందీలో రిలీజ్ కానట్టే అని ఫిక్స్ అయిపోయారుఫాన్స్.