Big Boss 5: లేస్తే హగ్.. కూర్చుంటే హగ్.. పడుకుంటే హగ్.. బిగ్‌బాసంటే హగ్‌లేనా?

లేవగానే హగ్.. కూర్చుంటే హగ్.. పడుకుంటే హగ్ అవసరమా.. బిగ్ బాస్ అంటే హగ్‌లు చేసుకోవడమేనా.. ప్రతిదానికి హగ్ అవసరమా. ఇది ఎవరి గురించో అర్ధమయ్యే ఉంటుంది కదా. బిగ్ బాస్ ఈ సీజన్ లో..

Big Boss 5: లేస్తే హగ్.. కూర్చుంటే హగ్.. పడుకుంటే హగ్.. బిగ్‌బాసంటే హగ్‌లేనా?

Big Boss 5 (1)

Big Boss 5: లేవగానే హగ్.. కూర్చుంటే హగ్.. పడుకుంటే హగ్ అవసరమా.. బిగ్ బాస్ అంటే హగ్‌లు చేసుకోవడమేనా.. ప్రతిదానికి హగ్ అవసరమా. ఇది ఎవరి గురించో అర్ధమయ్యే ఉంటుంది కదా. బిగ్ బాస్ ఈ సీజన్ లో ఈ హగ్గుల దుమారం రేగుతున్న సంగతి తెలిసిందే. లహరి మేల్ కంటెస్టెంట్లతో బిజీగా ఉండడమే కాకుండా అందరికి మాటిమాటికి హగ్గులు ఇస్తూ అందరినీ తన దారిలోకి తెచ్చుకోవాలని చూస్తుందని.. నైట్ రవి, లహరి ఘాడ హగ్గులో మునిగిపోయారని ప్రియా తన కళ్ళతో తానూ చూశానని దుమారం రేపిన సంగతి తెలిసిందే.

Big Boss 5: కాస్త ఎమోషన్..ఇంకాస్త రొమాంటిక్‌.. ప్రేమ పక్షుల గోరుముద్దలు!

ప్రియా కామెంట్స్ పై గత వారం హౌస్ లో రచ్చ రచ్చ జరిగింది. కాగా, బిగ్ బాస్ హౌస్‌ నుంచి రెండో వారంలోనే బ్యాగ్ సర్దేసిన ఉమాదేవి కూడా ఇప్పుడు ఈ హగ్గులపై ఘాటు వ్యాఖ్యలు చేసింది. ప్రియ గారు అన్న మాటల్లో తప్పేం లేదు.. అక్కడ ఏం జరిగిందో చూసింది చూసినట్టు చెప్పారు. ఆ విషయంలో ఆమె చాలా ఫైట్ చేశారు కానీ.. వీళ్లు ఒకేసారి మీద పడిపోవడంతో తట్టుకోలేకపోయారు. ప్రియ చెప్పడం కాదు.. నేనూ చెప్తున్నా.. వాళ్లిద్దరూ హగ్ చేసుకుంటున్నారు.

Big Boss 5: ఆ ఇద్దరితో లహరి బిజీ.. అగ్గిరాజేసిన ప్రియా కామెంట్స్

ప్రియ అన్నదాంట్లో తప్పేం ఉంది.. లహరి మెన్స్‌తోనే ఉంటుంది కదా.. మగాళ్లకే హగ్‌లు ఇస్తుంది.. అంత ప్రేమ ఉంటే.. హౌస్‌లో ఉన్న ఆడవాళ్లకి హగ్‌లు ఇవ్వొచ్చు కదా అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అక్కడ అందరూ ఆంటీలు, అంకుల్స్‌నే చిన్న పిల్లలు ఎవరూ లేరక్కడన్న ఉమాదేవి రవి అంకుల్ కాకపోతే.. నాకు ఫ్యామిలీ ఉంది.. నా కూతురు చూస్తుంది.. మా ఆవిడ చూస్తుంది అని అనడం ఎందుకని ప్రశ్నించింది. ఇక, రవికి హౌస్ లో జరిగే ప్రతిదీ తెలుసనీ.. టీవీలో ఏది ప్లే చేస్తారో.. ప్రోమో ఎలా కట్ చేస్తారో తెలుసనీ.. అది బిగ్ బాస్ వాళ్లే చెప్పి పంపారనే అనుమానాలను వ్యక్తం చేసింది. ఒకవిధంగా ఈ సీజన్ విన్నర్ కూడా రవిని అని ఉమాదేవి తెల్చిపారేసింది.