Tollywood: పూర్ క్వాలిటీ VFXతో విఫలం అవుతున్న భారీ బడ్జెట్ సినిమాలు..

ఇటీవల భారీ విజువల్ ఎఫెక్ట్స్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న సినిమాలు అనుకున్న స్థాయిలో విజయం సాధించలేక పోతున్నాయి. ఇందుకు కారణం సినిమాలోని పూర్ క్వాలిటీ VFX. దర్శకుడు చెప్పాలనుకునే కథని ప్రేక్షకుడి హృదయానికి మరింత దగ్గర చేస్తూ, ఎమోషనల్ గా చూపించడంలో విజువల్ ఎఫెక్ట్స్ ప్రధాన పాత్ర పోషిస్తాయి...

Tollywood: పూర్ క్వాలిటీ VFXతో విఫలం అవుతున్న భారీ బడ్జెట్ సినిమాలు..

Tollywood: ఇటీవల భారీ విజువల్ ఎఫెక్ట్స్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న సినిమాలు అనుకున్న స్థాయిలో విజయం సాధించలేక పోతున్నాయి. ఇందుకు కారణం సినిమాలోని పూర్ క్వాలిటీ VFX. దర్శకుడు చెప్పాలనుకునే కథని ప్రేక్షకుడి హృదయానికి మరింత దగ్గర చేస్తూ, ఎమోషనల్ గా చూపించడంలో విజువల్ ఎఫెక్ట్స్ ప్రధాన పాత్ర పోషిస్తాయి.

Adipurush: ఆ స్టార్ హీరో కోసం ఆదిపురుష్ స్పెషల్ స్క్రీనింగ్..?

అటువంటిది మూవీ మేకర్స్ ఈ విషయంలో మాత్రం ఎందుకు జాగ్రత్త చూపలేకపోతున్నారు అర్థంకావడం లేదు. హాలీవుడ్ ఎవెంజర్స్, అవతార్ మరియు రాజమౌళి బాహుబలి, RRR వంటి సినిమాల్లోని అద్భుతమైన VFX లు చూసిన ప్రేక్షకులు.. పూర్ క్వాలిటీ విజువల్ ఎఫెక్ట్స్ ని అంగీకరించ లేకపోతున్నారు. ఆ క్రమంలోనే ఆచార్య, రాదే శ్యామ్, బ్రహ్మాస్త్ర ఇంకెన్నో విఫలం కాక తప్పలేదు.

ఇటీవల విడుదలైన ప్రభాస్ ఆదిపురుష్ టీజర్.. ఈ విషయమై భారీగా ట్రోలింగ్ కి గురైంది. తాజాగా అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కిన “రామసేతు” సినిమా కూడా ఈ విమర్శలు ఎదుర్కోక తప్పడం లేదు. భారత ఇతిహాసమైన రామాయణంలోని రామసేతు అంశంపై తెరకెక్కిన ఈ సినిమా.. కథ, కథనంతో ఓకే అనిపించుకున్న పేలవమైన VFX లతో పరాజయం బాట పడుతుంది.