Bigg Boss -4 Telugu : 16 కంటెస్టెంట్లు పేర్లు, అందర్నీ ఏడిపించిన గంగవ్వ

  • Published By: madhu ,Published On : September 7, 2020 / 06:33 AM IST
Bigg Boss -4 Telugu : 16 కంటెస్టెంట్లు పేర్లు, అందర్నీ ఏడిపించిన గంగవ్వ

బుల్లితెరపై Bigboss -4 Telugu సందడి మొదలైంది. ఎప్పుడెప్పుడా అని చూస్తున్న ఈ రియాల్టీ షో గ్రాండ్ గా ప్రారంభమైంది. కరోనా కాలంలో ఈ షో ప్రసారమౌతుందా ? అనే సందేహాలకు చెక్ పెట్టేసింది Star MAA. ‘మాస్కు కావాల్సింది ముఖానికి కానీ ఎంటర్ టైన్ మెంట్ కు కాదు’ అంటూ స్క్రీన్ పైకి వచ్చేశాడు.



సాయంత్రం 6 గంటలకు టీవీల ముందు అతుక్కపోయారు. తారాజువ్వల వెలుగులో గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చాడు టాలీవుడ్ మన్మథుడు నాగార్జున. తన సినిమాలోని పాటలకే అదరగొట్టే స్పెప్పులేశాడు. అయితే..ఈసారి వేదికపై డ్యూయల్ రోయల్ చేయడం అందర్నీఅలరించింది.




వృద్ధుడైన తండ్రిగా, కుమారుడిగా ద్విపాత్రాభినయం చేస్తూ సందడి చేశారు. కానీ..కంటెస్టెంట్ విషయంలో స్టార్ మా సస్పెన్ష్ లో పెట్టింది. వారు..వీరు..సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరిగింది. షోలో ఒక్కొక్కరిని పిలుస్తూ..బిగ్ బాస్ హౌస్ లోకి పంపించాడు. మొత్తం ఈసారి 16 మంది కంటెస్టెంట్ లు ఉన్నారు.

1వ కంటెస్టెంట్
మొదటి కంటెస్టెంట్‌గా హీరోయిన్‌ మోనాల్‌ గజ్జర్‌ను నాగార్జున పరిచయం చేశారు. సుడిగాడు సినిమాతో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది ఈ భామ. తెలుగు, తమిళం, గుజరాతి, మళయాళం భాషల్లో నటించింది. అమ్మను మిస్ అవుతున్నా అంటూ తొలి రోజే ఏడ్చేసింది.

2వ కంటెస్టెంట్



రెండో కంటెస్టెంట్‌గా డైరెక్టర్‌ సూర్యకిరణ్‌ ను పిలిచారు నాగ్. ఈ సందర్భంగా ఈయనకు సంబంధించిన ఓ ఏవీని ప్రదర్శించారు. తెలుగులో తొలి చిత్రం సత్యంతో మంచి హిట్ సంపాదించారు ఈయన. హీరోయిన్ కళ్యాణిని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.

3వ కంటెస్టెంట్
మూడో కంటెస్టెంట్‌గా యాంకర్‌ లాస్య వచ్చారు. ఈమె పెళ్లి చేసుకున్న తర్వాత..బుల్లితెరకు దూరమైన సంగతి తెలిసిందే. తనకో కొడుకు ఉన్నాడని, కుటుంబ సభ్యులకు అప్పగించి..బిగ్ బాస్ లోకి వచ్చానన్నారు. లాస్యకు నాగార్జున ఓ స్పెషల్‌ గిప్ట్‌ ఇవ్వడం విశేషం.

4వ కంటెస్టెంట్



నాలుగో కంటెస్టెంట్స్‌గా గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చాడు హీరో అభిజిత్. తెలుగులో వచ్చిన లైఫ్‌ ఈజ్‌ బ్యూటీవుల్‌ హీరోగా నటించిన సంగతి తెలిసిందే. ఓ సాంగ్ తో వేదికపై వచ్చారు. మిర్చీ లాంటి కుర్రాడు సినిమా కూడా చేశాడు.

5వ కంటెస్టెంట్
ఐదో కంటెస్టెంట్స్‌గా యాంకర్‌ సుజాత వచ్చింది. తెలంగాణ యాసలో మాట్లాడుతూ..అందర్నీ ఆకట్టుకొంటోంది. తెలంగాణ యాసలో వార్తలు చదువుతూ..గుర్తింపు తెచ్చుకున్నారామె.

6వ కంటెస్టెంట్
ఆరో కంటెస్టెంట్‌గా మెహబూబా దిల్ సే వచ్చాడు. ఇతను టిక్ టాక్ షార్ట్ ఫిల్మ్ స్టార్. గుంటూరు జిల్లా వాసి. వేదికపై వచ్చిన ఇతను..తన జర్నీ గురించి చెప్పుకొచ్చాడు. ఇతనికి నాగ్ ఓ గిఫ్ట్ ఇచ్చి బిగ్ బాస్ హౌస్ లోకి పంపించాడు.

7వ కంటెస్టెంట్



ఏడో కంటెస్టెంట్‌ టీవీ9 టీవీ యాంకర్‌ దేవి నాగవల్లి వచ్చి అందర్నీ ఆశ్చపరిచింది బిగ్ బాస్ టీం. యాంకరింగ్, రిపోర్టింగ్ చేస్తూ..తన సత్తా చాటుతున్నారు. ఎంట్రీ ఇస్తూ..తాను విజేతను అవుతానని నమ్మకంగా చెప్పేసింది. న్యూస్ ప్రజెంటేషన్, వస్త్ర ధారణ, హెయిర్ స్టైల్ విచిత్రంగా ఉంటుందనే సంగతి తెలిసిందే.

8వ కంటెస్టెంట్
ఎనిమిదో కంటెస్టెంట్స్‌గా దేత్తడి హరిక వచ్చారు. ఈమె యూ ట్యూబ్ స్టార్. హైదరాబాద్ వాసి. అమెజాన్ లో ఉద్యోగం చేస్తూ…ఓ షార్ట్ ఫిల్మ్ లో నటించడం టర్నింగ్ పాయింట్ అని చెప్పవచ్చు. నెటిజన్స్ లో మంచి ఫాలోయింగ్ ఉంది.

9వ కంటెస్టెంట్



తొమ్మిదో కంటెస్టెంట్‌గా టీవీ నటుడు సయ్యద్ సోహైల్ ను పిలిచాడు నాగ్. యురేకా చిత్రంలో ఇతను నటించాడు.

10వ కంటెస్టెంట్
పదో కంటెస్టెంట్‌గా యాంకర్‌ అరియానా గ్లోరీ వేదికపైకి వచ్చారు. జెమినీ ఛానల్ లో వచ్చి కెవ్వు కామెండీ యాంకర్ గా పని చేశారు. ఐయామ్ బోల్ట్ అంటూ వచ్చారు. అయితే..సోహైల్, అరియానాలను బిగ్ బాస్ లోకి పంపించకుండా..నేబర్ హౌజ్ లోకి పంపించాడు నాగ్.

11వ కంటెస్టెంట్



పదకొండు కంటెస్టెంట్ గా డైరెక్టర్ అమ్మ రాజశేఖర్ ఎంట్రీ ఇచ్చారు. కింగ్ సినిమాలోని పాటకు ఇతను స్పెప్పులేశారు. కొరియోగ్రాఫర్ గా సినిమా రంగంలోకి ప్రవేశించారు. దర్శకుడిగా మారారు. రణం, ఖతర్నాక్, టక్కరి సినిమాలకు దర్శకత్వం వహించారు.

12వ కంటెస్టెంట్
12 వ కంటెస్టెంట్‌గా కరాటే కల్యాణి వచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..తనను అందరూ మోసం చేశారని కంటతడిపెట్టారు. తనకు పిల్లలు లేరని, ఓ బాబును దత్తత తీసుకుని పెంచుకుంటున్నట్లు చెప్పారు. ఓ ఏవీని ప్రదర్శించారు.



13వ కంటెస్టెంట్
13వ కంటెస్టెంట్‌గా సింగర్‌ నోయల్‌ ఎంట్రీ ఇచ్చాడు. ఇతను అందరికీ తెలుసు. యాంకర్ కమ్ యాక్టర్. నేపథ్య గాయకుడిగా సక్సెస్ అయ్యారు. ది షేక్ గ్రూప్ పేరిట ఒక తెలుగు బ్యాండ్ ను నిర్వహిస్తున్నాడు.

14వ కంటెస్టెంట్



14వ కంటెస్టెంట్ గా దివిని పిలిచారు నాగ్. తనకు యాక్టింగ్ ఇష్టమని వేదికపై చెప్పింది. తొలుత మోడలింగ్ చేసి నటిగా మారానన్నారు. వెబ్ సిరీస్ లు చేశానని, ప్రస్తుతం సినిమాలు చేస్తున్నట్లు చెప్పింది.
https://10tv.in/supreme-court-english-medium-in-government-schools-in-ap/
15వ కంటెస్టెంట్‌
15వ కంటెస్టెంట్‌గా నటుడు అఖిల్‌ ఎంటరయ్యాడు. వేదికపై నాన్ స్టాప్ గా 50 డిప్స్ కొట్టి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. తనకు అఖిల్ పేరు ఎందుకు పెట్టారో చెప్పాడు. `సిసింద్రి` సినిమా విడుదలైన మరుసటి రోజు తాను పుట్టినట్లు, అందుకే తనకు అఖిల్‌ పేరు పెట్టారని తెలిపాడు.

16వ కంటెస్టెంట్
ఇక 16వ కంటెస్టెంట్ గా యూ ట్యూబ్ లో పేరు గడించిన గంగవ్వ వచ్చారు. మై విలేజ్ షో పేరిట గంగవ్వ ఫేమస్ అయ్యింది. తెలంగాణ యాసతో ఆకట్టకుంటోంది. తన కష్టాలు చెప్పుకుని భావోద్వేగానికి గురయ్యింది.



15 వారాల పాటు 16 మందితో ఈ షో సాగనుంది.