Tollywood Heros : టాలీవుడ్ హీరోలని టార్గెట్ చేసిన బాలీవుడ్ ఆడియన్స్.. ట్రోల్స్ తో హడావిడి..

పాన్ ఇండియా... పాన్ ఇండియా... పాన్ ఇండియా... అంటూ మన హీరోలు హిందీ మార్కెట్ లోకి చొచ్చుకెళ్లారు... అయితే బాలీవుడ్ లో ఏ రేంజ్ లో ఆకాశానికెత్తేస్తారో అంతకంటే భారీ లెవల్ లో ట్రోల్ చేసి..............

Tollywood Heros : టాలీవుడ్ హీరోలని టార్గెట్ చేసిన బాలీవుడ్ ఆడియన్స్.. ట్రోల్స్ తో హడావిడి..
ad

Tollywood Heros :  పాన్ ఇండియా… పాన్ ఇండియా… పాన్ ఇండియా… అంటూ మన హీరోలు హిందీ మార్కెట్ లోకి చొచ్చుకెళ్లారు… అయితే బాలీవుడ్ లో ఏ రేంజ్ లో ఆకాశానికెత్తేస్తారో అంతకంటే భారీ లెవల్ లో ట్రోల్ చేసి, పడేస్తారు. మొన్న ప్రభాస్, నిన్న మహేశ్, లేటెస్ట్ గా అల్లు అర్జున్ కు ఈ పాన్ ఇండియా ట్రోలింగ్ టేస్ట్ చుపిస్తున్నారు అక్కడి ఆడియన్స్.

రీసెంట్ గా పుష్ప సినిమా నేషనల్ వైడ్ ఆడియన్స్ ను ఆకట్టుకుని, అల్లు అర్జున్ క్రేజ్ ను అమాంతం పెంచేసింది. అంతే కాదు పుష్ప సినిమాలో బన్నీ మాస్ లుక్ నార్త్ ఆడియన్స్ ను బాగా ఎట్రాక్ట్ చేసింది. అయితే పుష్ప2 కోసం అదే లుక్ ను కంటిన్యూ చేస్తున్న అల్లు అర్జున్ ఫోటో ఒకటి లేటెస్ట్ గా వైరల్ అవుతోంది. అందులో ప్రింటెడ్ టి షర్ట్ రింగుల జుట్టు, గుబురు గడ్డంతో గాగుల్స్ పెట్టుకున్న బన్నీ లుక్ ని బాలీవుడ్ ఆడియన్స్ ట్రోలింగ్ చేస్తున్నారు. క్రికెటర్ మలింగను గుర్తు చేసావని, వడపావ్ లా తయారయ్యావని ట్రోల్ చేయడంతో ఈ లుక్ వైరల్ గామారింది.

OTT Realeses : నిర్మాతలు ఫిక్స్.. 50 రోజుల తర్వాతే ఓటీటీకి..

స్టేట్ మెంట్స్ కాస్త అటూ ఇటూ అయినా కూడా ట్రోలింగ్ బారిన పడాల్సిందే అని సూపర్ స్టార్ మహేశ్ బాబు విషయంలో మరోసారి ప్రూవ్ అయ్యింది. ఆ మధ్య మేజర్ సినిమా ప్రమోషన్స్ టైమ్ లో బాలీవుడ్ పైన తనకు ఆసక్తి లేదని, బాలీవుడ్ తనని భరించలేదన్నందుకు బాలీవుడ్ ప్రముఖులు తప్పుపట్టగా, బాలీవుడ్ ప్రేక్షకులు అది మనసులో పెట్టుకుని, బాలీవుడ్ భరించలేదు కాని, పాన్ మసాలా భరిస్తుందా అని మహేష్ బాబు చేసిన పాన్ బహర్ యాడ్ మీద ట్రోల్స్ తో విరుచుకుపడ్డారు.

బాహుబలి సిరీస్, సాహో సినిమాలతో నార్త్ ఆడియన్స్ కు అభిమాన హీరో అయ్యారు ప్రభాస్. ఆ మధ్య ఆదిపురుష్ అనౌన్స్ మెంట్ అయిన తర్వాత ముంబాయిలో మేకప్ లేకుండా ప్రభాస్ ను చూసిన బాలీవుడ్ ఆడియన్స్ ప్రభాస్ బొద్దుగా కనిపించే సరికి వడపావ్ తో పోల్చి ట్రోలింగ్ చేశారు. అంతే కాదు, ప్రభాస్ అంకుల్ లా ఉన్నారని కొందరు ట్రోల్ చేస్తే, చాలా వికారంగా ఉన్నాడనే కామెట్స్ తో మరికొందరు విమర్శించారు. ఇలా సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ తో రెచ్చిపోతున్నారు బాలీవుడ్ ఆడియన్స్. దాంతో పాన్ ఇండియా ఇమేజ్ తో పాటు, పాన్ ఇండియా ట్రోలింగ్స్ ని భరించాల్సి వస్తోంది మన హీరోలకు.