RRR : RRR ఆస్కార్ పై బాలీవుడ్ సింగర్ ట్వీట్.. సిగ్గుగా ఉంది!

రాజమౌళి తెరకెక్కించిన RRR చిత్రం ఆస్కార్ గెలుచుకోవడంతో దేశవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తుంది. సినీ ప్రముఖల దగ్గర నుంచి ప్రధాని వరకు ప్రతి ఒక్కరు RRR టీం ని అభినందిస్తూ ట్వీట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక బాలీవుడ్ సింగర్ 'అద్నాన్ సమీ' చేసిన ట్వీట్ వైరల్ అవుతుంది.

RRR : RRR ఆస్కార్ పై బాలీవుడ్ సింగర్ ట్వీట్.. సిగ్గుగా ఉంది!

RRR : రాజమౌళి తెరకెక్కించిన RRR చిత్రం ఆస్కార్ గెలుచుకోవడంతో దేశవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తుంది. సినీ ప్రముఖల దగ్గర నుంచి ప్రధాని వరకు ప్రతి ఒక్కరు RRR టీం ని అభినందిస్తూ ట్వీట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక బాలీవుడ్ సింగర్ ‘అద్నాన్ సమీ’ చేసిన ట్వీట్ వైరల్ అవుతుంది. తెలుగులోను పలు సినిమాల్లో పాటలు పాడాడు ఈ సింగర్. కాగా అద్నాన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశిస్తూ ట్వీట్ చేశాడు.

Oscars95 : గత ఏడాది కంటే ఈ సంవత్సరం ఆస్కార్ చూసిన వారి సంఖ్య 12% పెరిగింది.. కారణం అదేనా?

నాటు నాటు సాంగ్ ఆస్కార్ అందుకోవడంతో, సీఎం జగన్ అభినందిస్తూ ఒక ట్వీట్ చేశారు. “అంతర్జాతీయ స్థాయిలో మన తెలుగు జెండాని రెపరెపలాడిస్తూ నాటు నాటు ఆస్కార్ అందుకోవడం చాలా గర్వంగా ఉంది” అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కి సింగర్ అద్నాన్ రియాక్ట్ అవుతూ ట్వీట్ చేశాడు. ”తెలుగు జెండా అంటూ ప్రాంతీయ భావం రేకెత్తిస్తూ మనుషులను వేరు చేయడం చూస్తుంటే సిగ్గుగా ఉంది. ఆస్కార్ అందుకున్న మొదటి ఇండియన్ సినిమా RRR. ఇది జాతీయ గౌరవం” అంటూ వ్యాఖ్యానించాడు.

95th Oscar Winners : 95వ ఆస్కార్ అవార్డు గ్రహీతలు..

ఇక ఈ ట్వీట్ కి పలువురు పలు రకాలుగా స్పందిస్తున్నారు. కొందరు సింగర్ అద్నాన్ ని సపోర్ట్ చేస్తూ మాట్లాడుతుండగా, మరి కొంతమంది మాత్రం వ్యతిరేకిస్తున్నారు. అదే ఈ అవార్డు హిందీ సినిమాకి వస్తే.. బాలీవుడ్ మూవీ అంటూ చెప్పుకునేవాళ్లు కదా? అంటూ ప్రశ్నిస్తున్నారు. కాగా ఆస్కార్ ప్రమోషన్స్ సమయంలో కూడా రాజమౌళి నాటు నాటు తెలుగు పాట అని చెప్పినప్పుడు కూడా కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేశారు.