Movie Release: బాక్సాఫీస్ బ్యాటిల్.. ఏప్రిల్‌లో 8 సినిమాలు రిలీజ్!

సమ్మర్ హీట్ తో పాటు సినిమాల స్పీడ్ కూడా పెరిగిపోయింది. వారానికో సినిమా రిలీజ్ చేసే రోజులు పోయి.. ఒకే రోజు రెండు సినిమాల రిలీజ్ లతో బిజీ అవ్వబోతున్నాయి ధియేటర్లు. ఇప్పటి వరకూ..

Movie Release: బాక్సాఫీస్ బ్యాటిల్.. ఏప్రిల్‌లో 8 సినిమాలు రిలీజ్!

Movie Release

Movie Release: సమ్మర్ హీట్ తో పాటు సినిమాల స్పీడ్ కూడా పెరిగిపోయింది. వారానికో సినిమా రిలీజ్ చేసే రోజులు పోయి.. ఒకే రోజు రెండు సినిమాల రిలీజ్ లతో బిజీ అవ్వబోతున్నాయి ధియేటర్లు. ఇప్పటి వరకూ ఒకలెక్క.. ఇప్పటినుంచి ఒకలెక్క అనుకుంటూ బీస్ట్, కెజిఎప్2, ఆచార్య ఇలా వరస పెట్టి ఏప్రిల్ లో 8 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. మరి ఏ సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతున్నాయో డీటెయిల్డ్ గా చూద్దాం.

Movie Releases: స్టార్ హీరోల హవా.. చిన్న హీరోల టార్గెట్ ఈ రెండు నెలలే!

సినిమాలే.. సినిమాలు.. వారం వారం గ్యాప్ లేకుండా.. అసలు ఒకే రోజు రెండు రెండు సినిమా రిలీజ్ లతో సందడి చెయ్యబోతోంది టాలీవుడ్. స్పెషల్లీ ఈ మధ్య కాలంలో లేనన్ని సినిమాలతో ఏకంగా వచ్చే నెల ఏప్రిల్ లో 8 సినిమాలు రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. ఏప్రిల్ ఫస్ట్ న మాంచి కామెడీఎంటర్ టైనర్ తో బోణీ కొట్టబోతోంది మిషన్ ఇంపాజిబుల్ మూవీ. తాప్సీ లీడ్ రోల్ లో ఏజెంట్ శ్రీనివాస ఆత్రేయ సినిమా డైరెక్టర్ స్వరూప్ తెరకెక్కించిన మిషన్ ఇంపాజిబుల్ ఈ శుక్రవారం రిలీజ్ కు రెడీ అవుతోంది.

Movie Releases: విజయ్-యష్ మూవీ వార్.. మధ్యలో నేనున్నానంటున్న షాహిద్!

ఏప్రిల్ సెకండ్ వీక్ లో మెగా ప్రిన్స్ మూవీ రిలీజ్ అవుతోంది. ఈ సంవత్సరం స్టార్టింగ్ నుంచి ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుదామా అని వెయిట్ చేస్తున్న వరుణ్ తేజ్ గని మూవీ.. ఆఖరికి ఏప్రిల్ 8న ధియేటర్లోకొస్తోంది. సాయిమంజ్రేకర్ హీరోయిన్ గా కిరణ్ కొర్రపాటి డైరెక్షన్లో తెరకెక్కిన గని సినిమా బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో ఎమోషనల్ స్పోర్ట్స్ ఎంటర్ టైనర్ గా ఏప్రిల్ సెకండ్ వీక్ లో రిలీజ్ కు రెడీ అవుతోంది.

Movie Releases: ఈ వారం థియేటర్లలోకి రాబోతున్న సినిమాలివే!

ఏప్రిల్ లో ధియేటర్లో అసలు సిసలు ఫైట్ జరగబోతోంది మాత్రం ఏప్రిల్ 13, 14 తారీఖుల్లో. ఏప్రిల్ 13న తమిళ్ స్టార్ హీరో విజయ్ యాక్షన్ ఎంటర్ టైనర్ బీస్ట్ రిలీజ్ కాబోతోంది. విజయ్, పూజాహెగ్డే జంటగా తెరకెక్కిన ఈ మాస్ యాక్షన్ మూవీ పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ అవుతోంది. ఫస్ట్ లుక్, క్రేజీ సాంగ్స్ తోనే ఆడియన్స్ ని ఎంగేజ్ చేసిన విజయ్.. ఈసారి పాన్ ఇండియా మొత్తం తన సత్తా చూపించబోతున్నాడు.

Movie Releases: కళకళాడుతున్న టాలీవుడ్.. ఎటు చూసినా ఫుల్ జోష్!

ఏప్రిల్ 14న ధియేటర్లు దద్దరిల్లబోయే సినిమా రిలీజ్ అవుతోంది. అసలు సిసలు యాక్షన్ ఎంటర్ టైన్ మెంట్ అప్పుడే స్టార్టవ్వబోతోంది. కెజిఎఫ్ తో ఇండస్ట్రీ రికార్డుల్ని తిరగరాసిన యష్ ఈ సారి అంతకుమించిన యాక్షన్ ఎలివేషన్ తో ఆడియన్స్ ముందుకొస్తున్నాడు. భారీబడ్జెట్, సంజయ్ దత్, రవీనా టాండన్ లాంటి భారీ బాలీవుడ్ స్టార్ కాస్ట్ అంతకుమించి భారీ గ్రాండియర్ తో ఎన్నో ఎక్స్ పెక్టేషన్స్ మధ్య ఏప్రిల్ 14న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతోంది కెజిఎఫ్ 2.

KGF2: కేజీఎఫ్ చాఫ్టర్-2 రన్ టైమ్ లాక్.. సెన్సార్ రిపోర్ట్ ఇదే!

కెజిఎఫ్ 2 ప్రభంజనం కంటిన్యూ అవుతుండగానే ధియేటర్లోకి వద్దామని ప్లాన్ చేసుకున్నాయి రెండు చిన్న సినిమాలు. ఏప్రిల్ 22న సుమ లీడ్ రోల్ లో విలేజ్ బ్యాక్ డ్రాప్ ఎంటర్ టైనర్ జయమ్మ పంచాయితీ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇక వరసగా సీరియస్ సినిమాలు చేస్తున్న నాగశౌర్య.. ఫస్ట్ టైమ్ తనలోని కంప్లీట్ రొమాంటిక్ యాంగిల్ చూపించబోతున్నాడు. షెర్లీ షెటియా హీరోయిన్ గా అనీష్ కృష్ణ డైరెక్షన్లో కృష్ణ వ్రిందా విహారిగా ఏప్రిల్ 22న సమ్మర్ హీట్ లో కూల్ లవ్ స్టోరీతో ధియేటర్లోకి రాబోతున్నాడు.

Krishna Vrinda Vihari: కృష్ణ విందా విహారి ఫస్ట్ లుక్.. నాగశౌర్య ఒడిలో షెర్లీ!

ఇక ఏప్రిల్ 22న మాస్ కా దాస్ విష్వక్ సేన్ క్యూట్ బాయ్ గా కనిపిస్తున్న అశోక వనంలో అర్జున కళ్యాణం అనే ఇంట్రస్టింగ్ మూవీ రిలీజ్ ఫిక్స్ చేసుకుంది. విష్వక్ ఇప్పటి వరకూ చేసిన మాస్ యాంగిల్ నుంచిరూట్ మార్చి ఫ్యామిలీ ఆడియన్స్ ని ఎంగేజ్ చెయ్యడానికి చేసిన ఈ అశోక వనంలో అర్జునకళ్యాణం ఇప్పటికే పాజిటివ్ వైబ్ క్రియేట్ చేసింది.

Acharya: ఆచార్య రిలీజ్ డేట్ ఫిక్స్.. సమ్మర్‌లో హీట్ పెంచనున్న పెద్ద సినిమాలు

ఏప్రిల్ లాస్ట్ వీక్ ఎప్పుడొస్తుందా.. మెగాస్టార్ ని ఎప్పుడెప్పుడు థియేటర్లో చూద్దామా అని వెయిట్ చేస్తున్న వాళ్లకోసం ఏప్రిల్ 29న రిలీజ్ అవుతోంది ఆచార్య మూవీ. ఒక వైపు మెగాస్టార్ చిరంజీవి, మరోవైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లీడ్ రోల్స్ లో చేస్తున్న సినిమా ఆచార్య. ఈ తండ్రీ కొడుకుల కెమిస్ట్రీని ఫుల్ ఫ్లెడ్జ్ గా స్క్రీన్ మీద చూడడానికి ఇప్పటికే ఎదురుచూస్తున్నారు ఫాన్స్. ఇంత క్రేజ్ ఉన్న ఆచార్య కొరటాల శివ డైరెక్షన్లో తెరకెక్కి అన్ని హంగులతో ఏప్రిల్ 29న రిలీజ్ కురెడీ అవుతోంది. ఇలా ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా 8 సినిమాలో ఏప్రిల్ ఆడియన్స్ కి ఫీస్ట్ ఇవ్వడానికి రెడీ అవుతున్నాయి ధియేటర్లు.