Twitter లో #boycottchhapak ట్రెండింగ్

  • Published By: madhu ,Published On : January 8, 2020 / 01:15 PM IST
Twitter లో #boycottchhapak ట్రెండింగ్

పిట్లకూత..అదే Twitterలో #boycottchhapak హ్యాష్ ట్యాగ్ ఫుల్‌గా ట్రెండ్ అవుతోంది. 3 ప్లేస్‌లో కొనసాగుతోంది. చపాక్ అనేది హింది సినిమా. ఇందులో బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొనె నటించింది. యాసిడ్ దాడది బాధితులు లక్ష్మీ అగర్వాల్ జీవిత కథతో రూపొందించారు. విక్రాంత్ కథానాయకుడిగా నటించారు. బాయ్ కాట్ ఎందుకు అంటున్నారు అనేగా మీ డౌట్. దీనికి కారణం ఉంది. దేశ రాజధాని ఢిల్లీలోని ప్రతిష్టాత్మక జవహార్ లాల్ యూనివర్సిటీని 2020, జనవరి 07వ తేదీ మంగళవారం దీపికా పదుకొనె సందర్శించింది.

 

కొద్ది రోజుల క్రితం ముసుగులు ధరించిన వ్యక్తులు వర్సిటీలోకి ప్రవేశించి..బీభత్సం సృష్టించారు. విద్యార్థులను, అధ్యాపకులను చితబాదారు. దీంతో విద్యార్థులకు గాయాలయ్యాయి. ఈ సందర్భంగా దీపికా వారిని పరామర్శించేందుకు అక్కడకు వెళ్లారు. బ్లాక్ కలర్స్ రంగుతో ఉన్న డ్రెస్ వేసుకుని దీపికా..విద్యార్థులతో మాట్లాడారు. సంఘీభావం తెలుపుతూ క్యాంపస్‌లో జరిగిన ఓ మీటింగ్‌లో పాల్గొన్నారు. 

అయితే..దీనిపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. #boycottchhapak హ్యాష్ ట్యాగ్‌తో పోస్టులు పెడుతున్నరు. దీపికపై మండిపడుతున్నారు. సినిమా ప్రచారం కోసం ఇంత దిగజారుతారా ? అంటూ ప్రశ్నిస్తున్నారు. దేశ ద్రోహులపై ప్రేమ ఒలకబోస్తున్నారని, గాయపడిన ఏబీవీపీ వాళ్ల సంగతేంటీ అంటూ నిలదీస్తున్నారు. బుక్ చేసుకున్న టికెట్లు క్యాన్సిల్ చేసుకున్నామంటూ పోస్టు చేస్తున్నారు.

 

దేశంలో ఎన్నో సమస్యలున్నాయని, ఆకలితో అలమిటిస్తున్న, చదువు కోసం తపిస్తున్న వారి కోసం ఏమైనా చేయవచ్చు కదా..వారి కోసం టైం కేటాయించ వచ్చు కదా…అంటూ కొతమంది సూచిస్తున్నారు. మరికొంతమంది నెటిజన్లు దీపికకు సపోర్టు ఇస్తున్నారు. ఫేవరేట్ హీరోయిన్ దీపిక. ఆమె నటించిన చపాక్ సినిమా తప్పక చూడాల్సిందేనంటూ కౌంటర్ ఇస్తున్నారు. చపాక్ సినిమాకు దీపికా నిర్మాతగా వ్యవహరించారు. జనవరి 10న విడుదల కానుంది. 

Read More : CAA వ్యతిరేకులను బ్రేకుల్లేని బస్సులో పాక్‌కు పంపిస్తాం – బండి సంజయ్