Krithi Shetty : బుల్లెట్ బండిపై డ్యూయెట్.. శింబు పాటకి అదిరిపోయే స్టెప్స్‌తో రామ్, కృతి

ఈ సినిమా నుంచి బుల్లెట్ సాంగ్ రిలీజ్ అయింది. తమిళ్ స్టార్ హీరో శింబు ఈ సినిమాలోని బుల్లెట్ సాంగ్ ని పాడారు. ఇటీవల దీనికి సంబంధించిన గ్లింప్స్ ని రిలీజ్ చేయగా ఇవాళ..........

Krithi Shetty : బుల్లెట్ బండిపై డ్యూయెట్.. శింబు పాటకి అదిరిపోయే స్టెప్స్‌తో రామ్, కృతి

Bullet Song

Ram :  ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ఇస్మార్ట్ శంకర్ తో భారీ కంబ్యాక్ ఇచ్చాడు. దాని తర్వాత తెలుగు, తమిళ్ భాషల్లో ”ది వారియర్” అనే సినిమాని తమిళ్ డైరెక్టర్ ఎన్ లింగుసామి దర్శకత్వంలో చేస్తున్నాడు. రామ్ కెరీర్ లోనే భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా, మొదటి సారి పోలీస్ పాత్రలో ‘ది వారియర్’ రూపొందిస్తున్నారు. ఇందులో కృతిశెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా, ఆది పినిశెట్టి విలన్ గా చేయబోతున్నారు.

తాజాగా ఈ సినిమా నుంచి బుల్లెట్ సాంగ్ రిలీజ్ అయింది. తమిళ్ స్టార్ హీరో శింబు ఈ సినిమాలోని బుల్లెట్ సాంగ్ ని పాడారు. ఇటీవల దీనికి సంబంధించిన గ్లింప్స్ ని రిలీజ్ చేయగా ఇవాళ పూర్తి లిరికల్ పాటని విడుదల చేశారు. ఈ పాటని శింబు తమిళ్, తెలుగు భాషల్లో పాడగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఇక ఇప్పటికే బంగార్రాజు సినిమాలో ఓ సాంగ్ కి కృతి శెట్టి మాస్ బీట్ స్టెప్పులు వేసి అలరించింది. ఇప్పుడు ఈ బుల్లెట్ సాంగ్ లో రామ్ తో కలిసి మరోసారి అదిరిపోయే డ్యాన్స్ వేసింది.

Yash : రాకింగ్ స్టార్ యశ్‌కి ఆ హీరోయిన్‌తో కలిసి నటించాలని ఉందట..

లిరికల్ సాంగ్ లోనే చాలా స్టెప్స్ చూపించారు చిత్ర యూనిట్. లిరికల్ సాంగ్ లోనే ఇన్ని స్టెప్స్ ఉంటే ఫుల్ వీడియో సాంగ్ లో ఇంకెన్ని స్టెప్స్ ఉన్నాయో అని కృతి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రామ్ ఎనర్జీకి మ్యాచ్ అయ్యేలా కృతి సూపర్ డ్యాన్స్ వేసినట్లు అర్ధమవుతుంది. ఈ పాటకి శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. ఈ లిరికల్ సాంగ్ కూడా బాగా ఫేమస్ అయ్యేలా ఉంది. దేవిశ్రీ దీనికి అదిరిపోయే సంగీతం ఇచ్చారు. బుల్లెట్ బండి అంటూ యూట్యూబ్ లో ట్రెండ్ అవుతుంది ఈ సాంగ్.