Romantic: ప్రీమియర్ చూసిన సెలబ్స్.. ఆకాష్ బాగా హ్యాండిల్ చేశాడని ప్రశంసలు!

ఆకాష్ పూరి.. ఈ యంగ్ హీరోకి ఇప్పటికి పెద్ద హిట్ వచ్చింది లేదు. కానీ ప్రస్తుతం రిలీజ్ అవుతున్న రొమాంటిక్ సినిమాకి మాత్రం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నుంచి రౌడీ హీరో విజయ్ వరకూ అందరూ..

Romantic: ప్రీమియర్ చూసిన సెలబ్స్.. ఆకాష్ బాగా హ్యాండిల్ చేశాడని ప్రశంసలు!

Romantic

Romantic: ఆకాష్ పూరి.. ఈ యంగ్ హీరోకి ఇప్పటికి పెద్ద హిట్ వచ్చింది లేదు. కానీ ప్రస్తుతం రిలీజ్ అవుతున్న రొమాంటిక్ సినిమాకి మాత్రం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నుంచి రౌడీ హీరో విజయ్ వరకూ అందరూ తెగ ప్రమోట్ చేస్తున్నారు. మరి ఈ శుక్రవారం ధియేటర్లో కొస్తున్న రొమాంటిక్ సినిమా ఎలా ఉండబోతోంది..?

Allu Arjun: నార్త్ ఆడియన్స్‌ను ప్రసన్నం చేసుకునే పనిలో బన్నీ

పూరీ జగన్నాద్ కొడుకు ఆకాష్ పూరి, కేతిక జంటగా రమ్యకృష్ణ లీడ్ రోల్ లో అనిల్ డైరెక్షన్లో ఈ శుక్రవారం రిలీజ్ అవుతున్న సినిమా రొమాంటిక్. ఆకాష్ ఫుల్ ప్లెడ్జ్ హీరోగా కమర్షియల్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన ఈ సినిమా మీద ఎక్స్ పెక్టేషన్స్ ముందునుంచి ఫుల్ గా ఉన్నాయి. లేటెస్ట్ గా ఈ సినిమాకు సంబందించి ప్రీమియర్ కి స్టార్ సెలబ్రిటీస్ అటెండ్ అయ్యి సినిమా మీద ఇంకా హైప్ పెంచేశారు.

Aryan Khan: మునుపటి లాయర్లు అసమర్థులా.. ఆర్యన్ బెయిల్‌పై ఆర్జీవీ పంచ్‌లు!

కొడుకుని హీరోగా నిలబెట్టడానికి పూరీ జగన్ ప్రమోషన్లు ఫుల్ స్వింగ్ లో చేస్తున్నారు. స్టార్ హీరోలు ప్రభాస్, విజయ్ దేవరకొండతో గ్రాండ్ గా ప్రమోషన్లు చేసి సినిమా మీద ఇంకా ఇంట్రస్ట్ పెంచేశారు రొమాంటిక్ టీమ్. లేటెస్ట్ ప్రీమియర్స్ లో టాప్ డైరెక్టర్స్ అటెండ్ అయ్యి ఆకాష్ యాక్టింగ్ ని తెగ మెచ్చుకున్నారు. ఆకాష్ స్టార్ హీరోలా సినిమాని క్యారీ చేశాడంటూ తెగ మెచ్చుకున్నారు.

Soundarya Sharma: సౌందర్యకి దాచుకోడం మా చెడ్డ చిరాకేమో!

కంప్లీట్ లవ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన రొమాంటిక్ సినిమా యూత్ ని టార్గెట్ చేస్తోంది. రొమాంటిక్ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్స్, ట్రైలర్స్, సాంగ్స్ సినిమా మీద మంచి బజ్ క్రియేట్ చేశాయి. ఇడియట్ లాంటి సినిమా అని, ఈ క్యారెక్టర్ ని ఆకాష్ చాలా బాగా హ్యాండిల్ చేశాడని పూరీ ఫుల్ హ్యాపీ ఫీలవుతున్నారు. అక్టోబర్ 29న రిలీజ్ అవ్వబోతున్న ఈ సినిమాతో ఆకాష్ గ్యారంటీగా సక్సెస్ అవుతాడని, సినిమా హిట్ అవుతుందని ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు టీమ్.