Big Boss 5: సవాళ్లు.. మధ్యలో నానాబూతులు.. ఇది నిజంగా ‘మండే’నే!

తొలి వారం సండే కింగ్ నాగ్ రాకతో కాస్త కలరింగ్ తో పాటు వినోదం కూడా ఉంటుందన్న ప్రేక్షకులకు ఎలిమేషన్ తాలూకూ భారం ఎక్కువైన ఫీలింగ్ దక్కింది. అయితే..

10TV Telugu News

Big Boss 5: తొలి వారం సండే కింగ్ నాగ్ రాకతో కాస్త కలరింగ్ తో పాటు వినోదం కూడా ఉంటుందన్న ప్రేక్షకులకు ఎలిమేషన్ తాలూకూ భారం ఎక్కువైన ఫీలింగ్ దక్కింది. అయితే.. ఆ వెలితిని మండే రోజు ఫిల్ చేశాడు బిగ్ బాస్. రెండో వారం ఎలిమినేషన్ ప్రక్రియకు నామినేషన్‌ మొదలు పెట్టిన బిగ్ బాస్ రంగు పడుద్ది రేంజిలో ఈ నామినేషన్స్ టాస్క్ ఇచ్చాడు. అయితే.. ఈ ఎపిసోడ్ లో ఎవరి బలమేంటో తేల్చుకుందాం రండంటూ సవాళ్లు, ఉమాదేవి నోటి నుండి నానాబూతులు, యానీ మాస్టర్‌ బూతులు, శ్వేత ఉగ్రరూపంతో మండే అనే దానికి పూర్తిగా న్యాయం చేసేశారు.

Horror Movies: బంపర్ అఫర్.. ఈ హార్ర‌ర్ సినిమాలు చూస్తే రూ.ల‌క్ష పారితోష‌కం!

ప్రియను ఎలిమినేషన్ కు నామినేట్ చేసిన నటరాజ్‌ మాస్టర్‌ పై చిర్రెత్తిపోయిన ప్రియ ఇన్‌ఫ్లూయెన్స్‌ చేయడం ఆపేయాలని కౌంటరిస్తే.. ఇక తనను నామినేట్ చేసిన మానస్‌పై లోబో ఓ రేంజిలో ఫైర్ విత్ ఫైర్ అనేశాడు. లోబో.. నాటే నేమ్‌, ఇట్స్‌ ఏ బ్రాండ్‌, పెద్ద పెద్ద హీరోలు నన్ను గుర్తుపడతరు అని కాసేపు తనకు తాను డప్పు కొట్టుకున్నాడు. అంతేకాదు నా ముందు యాటిట్యూడ్‌ చూపిస్తున్నవ్‌, కానీ నా ముందు చిన్నపిల్లోడివి అంటూ అదోరకంగా రెచ్చపోయాడు.

Bigg Boss 5: వారానికి సరయూ అందుకున్న పారితోషకం ఇదే?

నాగార్జున పంపిన ఆలూ కూర వివాదంలో ఉమాదేవి బూతులు మాట్లాడితే ప్రియాంక సింగ్‌ పడీపడీ నవ్వింది. ఉమా బూతులు ఎంత దారుణంగా ఉన్నాయి ప్రియాంకా నవ్వు అంతగా ప్రేక్షకులను మాయ చేసింది. నామినేషన్ లో ఇక ఉమాదేవి తనవంతు రాగానే ఓ రేంజ్‌లో అందరికీ సవాలు విసిరింది. దమ్ముధైర్యం, బుద్ధిబలం ఉన్నవాళ్లు నాతో ఆడటానికి ట్రై చేయండి అని చాలెంజ్‌ చేసింది. ఈ క్రమంలో ఉమాదేవి, ప్రియాంక, యానీల మధ్య పెద్ద ఫైటే నడిచింది. ఇందులో నాకు రెస్పెక్ట్‌ అవసరం లేదని ఉమా తేల్చి చెప్పడంతో పింకీ.. పోవే ఉమా పో.. అని వ్యంగ్యంగా మాట్లాడింది.

Big Boss 5: నక్క టీమ్.. గద్ద టీమ్.. ఈ వారం ఎలిమినేషన్‌లో ఏడుగురు!

ఆడవాళ్లకి ఆడవాళ్లైనా గౌరవం ఇవ్వాలని ఉమాదేవి మీద మండిపడుతూ శ్వేతా ఎమోషనల్ డైలాగులతో హౌస్ చప్పట్లు మ్రోగిపోగా అదే శ్వేతా హమీదాను ఫేక్‌ అంటూ గట్టిగా ఆమె ముఖం మీద కొట్టినట్లుగా రంగు పూసింది. శ్వేత నన్ను కొట్టిందంటూ హమీదా ఏడవడంతో ప్రియ.. మానవత్వం గురించి మాట్లాడిన నువ్వు చేసిందేంటని శ్వేతను ప్రశ్నించింది. దీంతో తన తప్పు అంగీకరించిన శ్వేత మోకాళ్లపై కూర్చుని హమీదాకు సారీ చెప్పింది. హమీదాకి క్షమాపణలు చెప్పింది కానీ తనకు సారీ చెప్పలేదని హర్ట్‌ అయ్యాడు లోబో. ఇదంతా చూసిన షణ్ముఖ్ అసలు ఏం జరుగుతుందో అర్ధంకాక అవాక్కయి జుట్టు పీక్కుంటూ కూర్చున్నాడు.

10TV Telugu News