Chandramukhi 2: చంద్రముఖి సీక్వెల్ అప్పుడే లాక్ చేసిందా..?

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘చంద్రముఖి’ సినిమా గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్‌ను చిత్ర యూనిట్ తెరకెక్కిస్తోంది. దర్శకుడు పి.వాసు తెరకెక్కిస్తున్న చంద్రముఖి-2 మూవీలో రజినీకాంత్ స్థానంలో హీరోగా రాఘవ లారెన్స్ నటిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించి తాజాగా సోషల్ మీడియాలో ఓ వార్త జోరుగా చక్కర్లు కొడుతోంది.

Chandramukhi 2: చంద్రముఖి సీక్వెల్ అప్పుడే లాక్ చేసిందా..?

Chandramukhi 2 Movie Locks OTT Partner

Chandramukhi 2: తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘చంద్రముఖి’ సినిమా గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు తమిళంతో పాటు తెలుగు బాక్సాఫీస్‌ను ఏ విధంగా షేక్ చేసిందో అందరికీ తెలిసిందే. దర్శకుడు పి.వాసు తెరకెక్కించిన ఈ హార్రర్ థ్రిల్లర్ మూవీ ప్రేక్షకులను థియేటర్లలో వణికించేసింది. ఇక ఈ సినిమా బుల్లితెరపై కూడా గతకొన్నేళ్లుగా అలరిస్తూ వస్తోంది. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్‌ను చిత్ర యూనిట్ తెరకెక్కిస్తోంది.

Chandramukhi 2: అలా మొదలెట్టి, ఇలా ముగించేసిన చంద్రముఖి-2

దర్శకుడు పి.వాసు తెరకెక్కిస్తున్న చంద్రముఖి-2 మూవీలో రజినీకాంత్ స్థానంలో హీరోగా రాఘవ లారెన్స్ నటిస్తున్నాడు. దీంతో ఈ సినిమాపై అప్పుడే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. కాగా, ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను ఇటీవల స్టార్ట్ చేసిన చిత్ర యూనిట్ తొలి షెడ్యూల్‌ను ముగించేసుకుంది. ప్రస్తుతం రెండో షెడ్యూల్ కోసం రెడీ అవుతున్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా సోషల్ మీడియాలో ఓ వార్త జోరుగా చక్కర్లు కొడుతోంది.

Chandramukhi2: అఫీషియల్.. చంద్రముఖి సీక్వెల్‌లో లారెన్స్ ఎంట్రీ!

చంద్రముఖి 2 సినిమాకు సంబంధించిన ఓటీటీ రైట్స్ భారీ రేటుకు అమ్ముడైనట్లుగా చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ విషయంపై అటు చిత్ర యూనిట్ కానీ, నెట్‌ఫ్లిక్స్ కానీ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇవ్వకపోవడం గమనార్హం. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.