Chandramukhi : చంద్రముఖి 3 కూడా ఉందట.. హింట్ ఇచ్చిన లారెన్స్..

చంద్రముఖి 2లో బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ చంద్రముఖి పాత్రలో కనిపించనుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి అయిన ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది.

Chandramukhi : చంద్రముఖి 3 కూడా ఉందట.. హింట్ ఇచ్చిన లారెన్స్..

Chandramukhi part 3 announced by Raghava Lawrence

Chandramukhi :  2005లో రజినీకాంత్(Rajinikanth) హీరోగా జ్యోతిక(Jyothika) మెయిన్ లీడ్ లో వచ్చిన చంద్రముఖి(Chandramukhi) సినిమా ప్రేక్షకులని నవ్వించి, భయపెట్టి భారీ విజయం సాధించింది. మళ్ళీ ఇన్నాళ్లకు 18 ఏళ్ళ తర్వాత ఆ సినిమాకు సీక్వెల్ తీస్తున్నారు. కొన్ని నెలల క్రితం చంద్రముఖి 2 తీస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. చంద్రముఖి(Chandramukhi) తీసిన దర్శకుడు వాసునే(Vasu) మళ్ళీ ఇప్పుడు చంద్రముఖి సీక్వెల్ తీస్తున్నాడు. అయితే ఈ సారి రాఘవ లారెన్స్(Raghava Lawrence) హీరోగా నటించబోతున్నాడు.

చంద్రముఖి 2 షూటింగ్ కు ముందు రాఘవ లారెన్స్, వాసు రజినీకాంత్ వద్దకు వెళ్లి ఆశీస్సులు కూడా తీసుకున్నారు. ఇక చంద్రముఖి 2లో బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ చంద్రముఖి పాత్రలో కనిపించనుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి అయిన ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది. ఈ సినిమాలో రాధిక శరత్ కుమార్, లక్ష్మి మీనన్, వడివేలు.. ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా హీరో రాఘవ లారెన్స్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయం వెల్లడించాడు.

NTR 30 : షూటింగ్ లో జాయిన్ అయిన సైఫ్ అలీఖాన్.. అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన NTR 30

లారెన్స్ ఇటీవలే రుద్రుడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా సక్సెస్ మీట్ లో భాగంగా తన తర్వాతి సినిమాల గురించి మాట్లాడాడు. ఈ నేపథ్యంలో ఓ మీడియా ప్రతినిధి చంద్రముఖి గురించి మాట్లాడుతూ ఆ సినిమాలో పాము వెళ్లిపోవడంతో ఎండ్ చేశారు దానికి కంటిన్యూ చంద్రముఖి 2 సినిమాలో ఉంటుందా అని అడగగా లారెన్స్ సమాధానమిస్తూ.. అది ప్రస్తుతానికి సస్పెన్స్. కానీ దానికి చంద్రముఖి 3లో ముగింపు ఉంటుంది అని అన్నారు. దీంతో చంద్రముఖి 3 కూడా ఉండబోతున్నట్టు చెప్పేశాడు లారెన్స్. లారెన్స్ హారర్ సిరీస్ కాంచన వరుసగా సీక్వెల్స్ తీసుకుంటూ వస్తున్నాడు. అలాగే చంద్రముఖికి కూడా భవిష్యత్తులో సీక్వెల్స్ తీస్తాడేమో అని భావిస్తున్నారు ప్రేక్షకులు.