Anitha Chowdhary: సూరీడూ.. బాగా మారిపోయావ్ రా..

సినిమాల్లో కొన్ని పాత్రలు ఎప్పటికీ గుర్తిండిపోతాయి.. ఎప్పటికీ మరిచిపోలేనివిగా ఉంటాయి. అటువంటి ఓ పాత్రే చత్రపతి సినిమాలో అనితా చౌదరి పోషించిన తల్లి పాత్ర. దర్శకధీరుడు రాజమౌళి, ప్రభాస్ కాంబినేషన్లో సూపర్ హిట్ అయిన ఈ సినిమాలో అనిత చౌదరి ఓ చిన్నపిల్లోడికి తల్లిగా నటిస్తుంది.

Anitha Chowdhary: సూరీడూ.. బాగా మారిపోయావ్ రా..

Chatrapati

Chatrapathi’s Sureedu Latest pic: సినిమాల్లో కొన్ని పాత్రలు ఎప్పటికీ గుర్తిండిపోతాయి.. ఎప్పటికీ మరిచిపోలేనివిగా ఉంటాయి. అటువంటి ఓ పాత్రే చత్రపతి సినిమాలో అనితా చౌదరి పోషించిన తల్లి పాత్ర. దర్శకధీరుడు రాజమౌళి, ప్రభాస్ కాంబినేషన్లో సూపర్ హిట్ అయిన ఈ సినిమాలో అనిత చౌదరి ఓ చిన్నపిల్లోడికి తల్లిగా నటిస్తుంది.

ఈ పాత్రలు రెండూ సినిమాలో చాలా కీలకం.. ఛత్రపతి సినిమాలో సూరీడు పాత్రలో అదరగొట్టేసిన ఆ పిల్లాడి పేరు భశ్వంత్ వంశీ, ఈ సినిమాలో ఆ పాత్రలో అధ్భుతంగా నటించిన సూరీడు, తల్లిగా నటించిన అనితా చౌదరి లేటెస్ట్ గా కలుసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన చత్రపతి సినిమా విడుదలై 16 ఏళ్లు అవుతుండగా.. ఈ సినిమా రీమేక్ కూడా బాలీవుడ్ లో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా రెడీ అవుతోంది. ప్రభాస్ చత్రపతి సినిమాలో కీలక సన్నివేశం కావడంతో ఇప్పటికీ అందరికీ గుర్తుండే సీన్.. అనితా చౌదరి సూరీడు అంటూ చెప్పే సీన్.. ప్రభాస్ ఉగ్రరూపం చూపించే సీన్ ఇది..

అటువంటి బెస్ట్ సీన్లో కనిపించిన పిల్లోడు పెద్దోడుగా కనిపించడం.. వీరిద్దరి ఫోటో బయటకు రావడంతో నెట్టింట్లో కామెంట్లు మారుమ్రోగుతున్నాయి. సినిమాలో సూరీడుగా నటించిన భశ్వంత్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. భశ్వంత్ హీరోగా ఎంట్రీ ఇచ్చేలా ఉన్నాడంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్స్.. సూరీడూ.. బాగా మారిపోయావ్ రా.. అంటూ సరదగా అంటున్నారు. చైల్డ్ ఆర్టిస్ట్ భశ్వంత్ వంశీ వైల్డ్ లుక్లోకి మారిపోయాడని అంటున్నారు.