Bhola Shankar : చిరు లీక్స్ నుంచి మరో సాంగ్.. భోళా శంకరుడి సంగీత్ పార్టీ..
చిరు లీక్స్ నుంచి మరో సాంగ్ వచ్చేసింది. భోళా శంకర్ సినిమాలోని పార్టీ సాంగ్ షూట్ జరుగుతున్న సెట్స్ నుంచి చిరంజీవి..

Chiranjeevi leaks party song from Bhola Shankar shooting sets
Chiranjeevi Bhola Shankar : మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం భోళా శంకర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. సినిమా టాకీ పార్ట్ మొత్తం పూర్తి అయ్యినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం వరుసపెట్టి సాంగ్ షూటింగ్స్ జరుపుకుంటున్నారు. ఇటీవలే స్విట్జర్లాండ్‌లో ఒక సాంగ్ ని షూట్ ని పూర్తి చేసుకొని వచ్చారు. ఆ సాంగ్ షూట్ సమయంలో చిరు లీక్స్ అంటూ అక్కడి నుంచి కొన్ని ఫోటోలు లీక్ చేసి అభిమానులను ఖుషీ చేశాడు. చిరు లీక్స్ మరికొన్ని కూడా ఉన్నాయి అంటూ అప్పుడే చెప్పుకొచ్చాడు.
Rangabali : నాగశౌర్య ‘రంగబలి’ టీజర్ వచ్చేసింది.. కామెడీ అండ్ యాక్షన్‌తో అదిరిపోయింది!
తాజాగా మరో లీక్ ఫ్యాన్స్ కోసం చేశాడు. సినిమాలో ఓ సంగీత్ పార్టీ సాంగ్ ఉందట. ప్రస్తుతం అందుకు సంబంధించిన సాంగ్ షూట్ జరుగుతుంది. ఇక సెట్ నుంచి ఆ సాంగ్ బిట్ ని తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా లీక్ చేశాడు చిరంజీవి. “జామ్ జామ్ జజ్జినక” అంటూ పాత సాగనుంది. మహతి స్వరసాగర్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ పూర్తి సాంగ్ ని ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారు అనేది తెలియజేయలేదు.
RGV Vyooham : వ్యూహం నుంచి మరో పిక్ షేర్ చేసిన వర్మ.. ఏ పాత్ర ఎవరో గుర్తు పట్టండి చూద్దాం!
కాగా ఈ సినిమాని మెహర్ రమేష్ డైరెక్ట్ చేస్తున్నాడు. తమిళ హిట్ మూవీ ‘వేదాళం’కి ఇది రీమేక్ గా వస్తుంది. స్మగ్లింగ్, గ్యాంగ్ స్టార్ బ్యాక్ డ్రాప్ తో సిస్టర్ సెంటిమెంట్ లో ఈ సినిమా ఉండబోతుంది. చిరుకి చెల్లి పాత్రలో కీర్తి సురేష్ (Keerthy Suresh) కనిపిస్తుంది. మిల్కీ బ్యూటీ తమన్నా (Tamannaah) చిరు సరసన హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే హీరో సుశాంత్ ఒక ముఖ్య పాత్రలో కనిపించబోతున్నాడు. ఆగష్టు 11న ఈ సినిమా ఆడియన్స్ ముందుకు రాబోతుంది.
View this post on Instagram