Mahesh-Rajamouli: క్రేజీ కాంబో కోసం విక్రమ్ డేట్స్.. ఇందులో నిజమెంత?

జక్కన్న రాజమౌళి ఇప్పుడు క్రేజీ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్ కోసం శ్రమిస్తున్నాడు. ఆర్ఆర్ఆర్ సినిమాపై ప్రపంచ వ్యాప్తంగా ఎదురుచూపులతో ఎక్కడా తగ్గకుండా ఉండేందుకు జక్కన్న అండ్ కో తీవ్రంగా..

Mahesh-Rajamouli: క్రేజీ కాంబో కోసం విక్రమ్ డేట్స్.. ఇందులో నిజమెంత?

Mahesh Rajamouli

Mahesh-Rajamouli: జక్కన్న రాజమౌళి ఇప్పుడు క్రేజీ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్ కోసం శ్రమిస్తున్నాడు. ఆర్ఆర్ఆర్ సినిమాపై ప్రపంచ వ్యాప్తంగా ఎదురుచూపులతో ఎక్కడా తగ్గకుండా ఉండేందుకు జక్కన్న అండ్ కో తీవ్రంగా శ్రమిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుండి వచ్చిన అప్డేట్స్ తో ఎప్పుడెప్పుడు తారక్-చరణ్ లను వెండితెర మీద చూస్తామా అని సినీ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఎక్కడ చూసినా ఆర్ఆర్ఆర్ అనే ఉత్కంఠ నెలకొనగా మరోవైపు ఇదే సమయంలో జక్కన్న తర్వాత సినిమాపై కూడా పుకార్లు షికార్లు చేస్తూనే ఉన్నాయి.

Shyam Singha Roy: డ్యూయెల్ రోల్.. శ్యామ్ సింగరాయ్ కథ ఇదే!

ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేయనున్నాడు. మహేష్-రాజమౌళి ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నట్లుగా చెప్పేశారు. కేఎల్ నారాయణ నిర్మించబోతున్న ఈ సినిమా కోసం రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ కూడా సిద్ధం చేస్తున్నాడు. అయితే, ఇదే సమయంలో ఈ సినిమా మీద విపరీతమైన ప్రచారం జరిగిపోతుంది. ఈ సినిమా కోసం వాళ్ళని, వీళ్ళని ఎంచుకుంటున్నారని.. ఈ సినిమా హాలీవుడ్ రేంజ్ లో ఉంటుందని.. ఇది కౌబాయ్ సినిమా అని ఏవేవో ప్రచారం జరిగిపోతుంది.

Sherry Agarwal: అందాల గాలమేస్తున్న షెర్రీ అగర్వాల్

ఇక ఇప్పుడు ఈ సినిమాపై మరో కొత్త కథనం ఒకటి ఆసక్తిగా మారింది. మహేష్ సినిమా కోసం రాజమౌళి టీం తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ ను సంప్రదించారట. వచ్చే ఏడాది సమ్మర్ తర్వాత విక్రమ్ డేట్స్ కోసం ఈ సంప్రదింపులు చేయగా అందుకు విక్రమ్ కూడా ఒకే చెప్పినట్లుగా ఆ కథనం సారాంశం. రాజమౌళి సినిమాల కోసం ఇప్పుడు ఇతర బాషా నటులను ఎంపిక చేసుకోవడం తెలిసిందే కనుక ఇది కూడా నిజమేనేమో అనే ప్రచారం సోషల్ మీడియాలో ముమ్మరంగా వినిపిస్తుంది.

Telugu Multi Starrer Films: మల్టీస్టారర్ హవా.. డైరెక్టర్‌ల క్రేజీ కాంబోలు!

అయితే, అదే సమయంలో రాజమౌళికి ఒక సినిమా విడుదల చేయకుండా మరో సినిమా గురించి ప్రీ ప్రొడక్షన్, క్యాస్టింగ్ పనులు మొదలుపెట్టే అలవాటు లేదు. అందులో ఆర్ఆర్ఆర్ లాంటి ప్రతిష్టాత్మక సినిమా పనులలో ఉండగా తర్వాత సినిమా కోసం ఇప్పుడే నటీనటుల ఎంపిక చేయడం ఎంతవరకు నిజమనే వాళ్ళు కూడా లేకపోలేదు. ఒకవేళ విక్రమ్ తో సంప్రదింపులు నిజమైతే ఇదే కూడా ఒక రకంగా మల్టీస్టారర్ రేంజ్ సినిమా కావడం ఖాయమనుకోవచ్చు. మరి.. ఈ ప్రచారంపై రాజమౌళి వర్గం రెస్పాండ్ అయితే తప్ప క్లారిటీ వచ్చే ఛాన్స్ లేదు.