Rumour or Reality ? అక్టోబర్ లో థియేటర్లు రీ ఓపెన్ ?

  • Published By: madhu ,Published On : September 18, 2020 / 12:04 PM IST
Rumour or Reality ? అక్టోబర్ లో థియేటర్లు రీ ఓపెన్ ?

Unlock 4.0 : కరోనా ప్రభావంతో ఆరు నెలలుగా మూత పడిన థియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటాయనే ప్రశ్నకు జవాబు రావడం లేదు. ఈ రంగంపై ఆధారపడిన ఎంతో మంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సినిమా రంగంలో పని చేసుకొనే చిన్న చిన్న కార్మికులు అవస్థలు అంతాఇంతా కాదు. ఆకలితో అలమటిస్తున్నారు.




అన్ లాక్ లో భాగంగా కొన్నింటికి అనుమతినిస్తోంది కేంద్రం. ఈ క్రమంలో థియేటర్లు ఓపెన్ చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతున్నారు. గతంలో థియేటర్లు రీ ఓపెన్ చేయడానికి కేంద్రం అనుమతినిస్తుందని ప్రచారం జరిగిన..అలా జరగలేదు.

థియేటర్లను రీఓపెన్‌ చేయాలంటూ వివిధ భాషలకు చెందిన దర్శక నిర్మాతలు, ఎగ్జిబిటర్లు కోరుతున్నారు. థియేటర్ల మూసివేత కారణంగా వందల కోట్లలో నష్టపోవడంతో పాటు లక్షలాది మంది ఉపాధికి దూరమవుతున్నారని, అందుకే థియేటర్లను ప్రారంభించాలంటూ సేవ్‌ థియేటర్స్‌ పేరుతో సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వాలకు విన్నవిస్తున్నారు.




ఈ క్రమంలో అక్టోబర్ 01 నుంచి థియేటర్లను హోం మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలను సిద్ధం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. కఠిన నిబంధనలతో మల్టీప్లెక్స్, థియేటర్లను రీ ఓపెన్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారని తెలుస్తోంది.
https://10tv.in/v-movie-review/



అయితే..ఈ విషయాన్ని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఖండించింది. థియేటర్ల అనుమతుల విషయంలో హోం మంత్రిత్వ శాఖ ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదని తెలిపింది. మరి థియేటర్లు ఎప్పుడు రీ ఓపెన్ చేస్తారో చూడాలి.