Sankranthi Movies : వాల్తేరు వీరయ్య, వీరసింహా రెడ్డి సినిమాల్లో మరీ ఇన్ని కామన్ పాయింట్స్.. గమనించారా??

 ఈ సంక్రాంతికి టాలీవుడ్ నుంచి చిరంజీవి, బాలకృష్ణ తమ సినిమాలతో బరిలోకి దిగారు. చిరంజీవి వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమాలతో వచ్చి మంచి విజయాలు సాధించారు. సినిమా రిలిజ్ కి ముందే ఈ రెండు సినిమాల్లో చాలా కామన్ పాయింట్స్ ఉన్నాయి అని.............

Sankranthi Movies : వాల్తేరు వీరయ్య, వీరసింహా రెడ్డి సినిమాల్లో మరీ ఇన్ని కామన్ పాయింట్స్.. గమనించారా??

Common Points in Veerasimha Reddy and Waltair Veerayya Movies

Sankranthi Movies :  ఈ సంక్రాంతికి టాలీవుడ్ నుంచి చిరంజీవి, బాలకృష్ణ తమ సినిమాలతో బరిలోకి దిగారు. చిరంజీవి వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమాలతో వచ్చి మంచి విజయాలు సాధించారు. సినిమా రిలిజ్ కి ముందే ఈ రెండు సినిమాల్లో చాలా కామన్ పాయింట్స్ ఉన్నాయి అని అంతా అనుకోని ఆశ్చర్యపోయారు.

వాల్తేరు వీరయ్య, వీరసింహా రెడ్డి.. రెండు సినిమాలని కూడా ఒక నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించడం విశేషం. వాళ్ళే ఈ సినిమాలని డిస్ట్రిబ్యూట్ చేశారు కూడా. ఈ రెండిట్లో కూడా శృతి హాసన్ హీరోయిన్ అవ్వడం మరింత గమనార్హం. ఈ రెండు సినిమాల డైరెక్టర్స్ కి దర్శకులుగా మొదట లైఫ్ ఇచ్చింది రవితేజనే. ఇలా సంక్రాంతికి రిలీజ్ కి ముందే చాలా కామన్ పాయింట్స్ ఉన్నాయని అంతా భావించారు. ఇక సినిమా రిలీజ్ అయ్యాక మరిన్ని కామన్ పాయింట్స్ చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు.

Sankranthi Heros : ఏ హీరో ఎన్నిసార్లు సంక్రాంతికి వచ్చాడో తెలుసా?? సంక్రాంతి హీరోలు..

ఈ రెండు సినిమాలు కూడా రెండున్నర గంటలకు పైనే రన్నింగ్ టైం ఉంది. రెండు సినిమాల్లో హీరోల ఓపెనింగ్ షాట్స్ ఫైట్ సీన్స్ తోనే మొదలుపెట్టడం విశేషం. రెండూ పక్కా మాస్ సినిమాలు. రెండు సినిమాల్లోనూ మెయిన్ హీరోయిన్ కి అంతగా స్క్రీన్ స్పేస్ లేదు. వీరసింహారెడ్డి సినిమా హీరోకి, సవతి తల్లి కూతురుకి సంబంధించిన కథ అయితే వాల్తేరు వీరయ్య హీరోకి, సవతి తల్లి కొడుకుకి సంబంధించిన కథ అవ్వడం మరింత విశేషం. వాల్తేరు వీరయ్య అన్నయ్య-తమ్ముడు సెంటిమెంట్ అయితే వీరసింహారెడ్డి అన్నయ్య-చెల్లెలు సెంటిమెంట్ సినిమా. రెండు సినిమాల్లోనూ ఇంటర్వెల్ బ్యాంగ్ ఫారెన్ లోనే ఉంది. రెండు సినిమాల్లోనూ ఇంటర్వెల్ తర్వాత ఫ్లాష్ బ్యాక్ సీన్స్ ఉన్నాయి. రెండు సినిమాల్లోనూ క్లైమాక్స్ లో విలన్ పాత్ర తల నరికేయడం మరింత ఆశ్చర్యం. ఇలా ఈ సంక్రాంతికి రెండు సినిమాల్లోనూ అనేక కామన్ పాయింట్స్ ఉండటంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. అయినా ఈ సినిమాలు ప్రేక్షకులకి నచ్చి మంచి విజయం సాధించాయి.