Dasara: పండగకు రెండు రోజుల ముందే దసరా చేస్తోన్న నాని!

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘దసరా’ ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తుండగా, ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా ఈ సినిమా రాబోతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఈ సినిమా నుండి దసరా కానుకగా తొలి సింగిల్ సాంగ్‌ను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమయ్యింది.

Dasara: పండగకు రెండు రోజుల ముందే దసరా చేస్తోన్న నాని!

Dasara Movie First Single To Release On October 3rd

Dasara: నేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘దసరా’ ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తుండగా, ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా ఈ సినిమా రాబోతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఇక ఈ సినిమాలో నాని పూర్తిగా ఊరమాస్ లుక్‌లో కనిపిస్తుండటంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది.

Dasara: దసరా.. ఫిర్ షురూ!

సింగరేణి గణుల నేపథ్యంలో ఈ సినిమా వస్తున్నట్లుగా చిత్ర యూనిట్ ఇప్పటికే తెలిపింది. ఇక ఈ సినిమా నుండి దసరా కానుకగా తొలి సింగిల్ సాంగ్‌ను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమయ్యింది. ‘ధూంధాం దోస్తాన్’ అంటూ సాగే ఈ పాటను అక్టోబర్ 3న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తాజాగా వెల్లడించింది. ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తుండగా, నాని సరసన అందాల భామ కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది.

Nani: దసరా రోజున ధూంధాం దోస్తాన్ అంటోన్న నాని!

దసరా పండగకు రెండు రోజుల ముందే ఈ సినిమా తొలి లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేస్తుండటంతో ఈ పాట ఆడియెన్స్‌ను ఎంతమేర మెప్పిస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. మరి ఈ సినిమాలోని తొలి సింగిల్ సాంగ్ ఎలా ఉండబోతుందో తెలియాలంటే అక్టోబర్ 3 వరకు వెయిట్ చేయాల్సిందే. ఈ సినిమాను శ్రీ లక్ష్మీవెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ప్రొడ్యూస్ చేస్తున్నారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.