Dasara: దసరా.. ఫిర్ షురూ!

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘దసరా’ ఇప్పటికే షూటింగ్ మొదలుపెట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో ఈసారి ఎలాగైనా బాక్సాఫీస్ వద్ద సక్సెస్....

Dasara: దసరా.. ఫిర్ షురూ!

Nani Begins New Schedule Of Dasara Movie

Dasara: నేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘దసరా’ ఇప్పటికే షూటింగ్ మొదలుపెట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో ఈసారి ఎలాగైనా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ కొట్టి తీరాలని కసిగా ఉన్నాడు నాని. అయితే ఇటీవల ఆయన నటించిన ‘అంటే సుందరానికీ’ సినిమా ప్రమోషన్స్ కోసం దసరా చిత్రానికి కాస్త బ్రేక్ ఇచ్చాడు. కానీ.. ఈలోగా ఈ సినిమా ఆగిపోయిందంటూ పలు పుకార్లు ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా చక్కర్లు కొట్టాయి. అయితే వీటన్నింటికీ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఓ మీమ్‌తో సమాధానం ఇచ్చిన సంగతి తెలిసిందే.

Dasara: ‘దసరా’ ఉందంటూ బ్రహ్మీ మీమ్‌తో డైరెక్టర్ గట్టిగానే ఇచ్చాడుగా!

ఇప్పుడు తాజాగా ‘దసరా’ చిత్ర యూనిట్ నుండి ఓ అదిరిపోయే అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ శుక్రవారం నుండి మొదలుపెడుతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ షెడ్యూల్ చాలా లెంగ్తీగా కొనసాగబోతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఇక ఈ షెడ్యూల్ కోసం హైదరాబాద్‌లో ఓ భారీ సెట్ వేశారు చిత్ర యూనిట్. కాగా, ఈ షెడ్యూల్‌లో చిత్రంలోని దాదాపు అందరు నటీనటులు షూటింగ్‌లో పాల్గొంటారని చిత్ర యూనిట్ చెబుతోంది.

Dasara: ఆలస్యంగా రానున్న దసరా.. పండగ లేనట్టేనా?

ఇక ఈ సినిమాలో నాని ఊరమాస్ అవతారంలో నటిస్తుండగా, ఆయన సరసన అందాల భామ కీర్తి సురేష్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాను శ్రీకాంత్ ఓదెల తెలంగాణ ప్రాంతం నేపథ్యంలో తెరకెక్కిస్తుండగా, ఈ చిత్రాన్ని సుధాకర్ చెరుకూరి ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్‌ను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. మరి దసరా సినిమాను ఎప్పుడు పూర్తి చేస్తారో, ఎప్పుడు రిలీజ్ చేస్తారో చూడాలి.