Nani: దసరా రోజున ధూంధాం దోస్తాన్ అంటోన్న నాని!

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం ‘దసరా’ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు క్రియేట్ చేసిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర పోస్టర్స్, టీజర్ గ్లింప్స్ ఈ సినిమాపై అభిమానుల్లో అంచనాలను అమాంతం పెంచేశాయి. కాగా, ఈ సినిమా నుండి ఈ దసరా పండుగకు ఓ అదిరిపోయే ట్రీట్ ఇచ్చేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ సాంగ్‌ను దసరా రోజున రిలీజ్ చేస్తున్నట్లు హీరో నాని తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేశాడు.

Nani: దసరా రోజున ధూంధాం దోస్తాన్ అంటోన్న నాని!

Nani: నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం ‘దసరా’ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు క్రియేట్ చేసిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ సినిమాలో రస్టిక్ లుక్‌లో నాని కనిపిస్తుండటంతో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో నాని పూర్తిగా తెలంగాణ స్లాంగ్‌లో మాట్లాడుతుండటంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అని అభిమానులు ఆతృతగా చూస్తున్నారు.

Nani Dasara Movie : సమ్మర్ కి రెడీ అంటున్న దసరా.. ‘ఎట్లైతే గట్లే సూస్కుందామ్‌’.. సిల్క్‌స్మిత ఫోటో ముందు మందు సీసాతో నాని..

ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర పోస్టర్స్, టీజర్ గ్లింప్స్ ఈ సినిమాపై అభిమానుల్లో అంచనాలను అమాంతం పెంచేశాయి. కాగా, ఈ సినిమా నుండి ఈ దసరా పండుగకు ఓ అదిరిపోయే ట్రీట్ ఇచ్చేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ సాంగ్‌ను దసరా రోజున రిలీజ్ చేస్తున్నట్లు హీరో నాని తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేశాడు. ‘ధూంధాం దోస్తాన్’ అంటూ సాగే ఈ పాటను దసరా కానుకగా రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. ఇక ఈ చిత్రానికి సంగీతాన్ని సంతోష్ నారాయణన్ అందిస్తుండగా, ఈ పాటకు కొరియోగ్రఫీ ప్రేమ్ రక్షిత్ అందించాడు.

Nani : దసరా సినిమా లుక్ లో నాని స్పెషల్ ఫోటోషూట్

అందాల భామ కీర్తి సురేష్ ఈ సినిమాలో నటిస్తోండగా, ఆమె మరోసారి డీగ్లామర్ పాత్రలో మనకు ఈ సినిమాలో కనిపిస్తుంది. సాయి కుమార్, సముధ్రకణి, జరీనా వాహబ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తుండగా, సుధాకర చెరుకూరి ప్రొడ్యూస్ చేస్తున్నారు. మరి ఈ సినిమాలో ధూంధాం దోస్తాన్ సాంగ్ ఎలాంటి ఆదరణ అందుకుంటుందో తెలియాలంటే దసరా వరకు ఆగాల్సిందే.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.